Viral Video : ఈ ఏనుగును చూసి ఎంతో నేర్చుకోవాలి.. ఎందుకో ఈ వీడియోలో చూడండి
ఈ ఏనుగును చూసి ఎంతో నేర్చుకోవాలి | నీటిని వేస్ట్ చేయకూడదంటారు. కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఒక గ్లాస్ నీళ్లను కూడా సృష్టించలేము. నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే
ఈ లోకంలో మనం సృష్టించలేనివి రెండే రెండు. ఒకటి గాలి, రెండోది నీళ్లు. అందుకే గాలిని కలుషితం చేయకూడదంటారు. అలాగే.. నీటిని వేస్ట్ చేయకూడదంటారు. కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఒక గ్లాస్ నీళ్లను కూడా సృష్టించలేము. నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే.. భవిష్యత్తు తరాలకు కూడా ఎటువంటి కొరత లేకుండా నీరు దొరుకుతుంది. ఈ తరంలోనే ఇష్టం ఉన్నట్లు నీళ్లను వాడితే.. నీటిని వృధా చేస్తే.. భవిష్యత్తులో నీటికి కటకటే.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో ప్రజలకు కావాల్సినన్ని నీళ్లు లేవు. స్నానం చేయడానికి కూడా బకెట్ నీళ్లను కొనుక్కునే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అందుకే.. నీటిని సంరక్షించాలి.
అయితే.. ఈ విషయం మనుషులకే కాదు.. జంతువులకు కూడా తెలుసు.. అనే విషయం ఈ వీడియో ద్వారా స్పష్టమవుతుంది. ఓ ఏనుగు.. బాగా దాహం వేయడంతో అక్కడ ఉన్న ఓ బోరింగ్ దగ్గరకు వచ్చి బోరింగ్ పైప్‌తో కొట్టి నీళ్లు కింద పడ్డాక.. వాటిని ఏమాత్రం వేస్ట్ చేయకుండా.. అన్నింటినీ తాగేసింది. దానికి సరిపోయే అన్ని నీళ్లు వచ్చాక.. బోరింగ్ కొట్టడం ఆపేస్తుంది.
అబ్బ.. జంతువులకు కూడా వాటర్ వేస్ట్ చేయొద్దనే విషయం తెలుసా? నీళ్లు చాలా విలువైనవి అని జంతువులకు కూడా తెలిసినప్పుడు.. కొందరు మనుషులు మాత్రం ఎందుకు నీళ్లను వృధా చేస్తారో అర్థం కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
एक हाथी भी #जल की एक-एक #बूंद का महत्व समझता है। फिर हम इंसान क्यों इस अनमोल रत्न को व्यर्थ करते हैं?
— Ministry of Jal Shakti, DoWR, RD&GR, GoI (@DoWRRDGR_MoJS) September 3, 2021
आइए, आज इस जानवर से सीख लें और #जल_संरक्षण करें। pic.twitter.com/EhmSLyhtOI
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : ఫేస్ మాస్క్ పెట్టుకొని బికినీలో యువతి.. ఎయిర్‌పోర్ట్‌లో హల్చల్
ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష.. ఒకే ఊరిలో రెండు భాషలు
Viral Video : పళ్లతో రిబ్బన్ కట్ చేసిన మంత్రి.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

