ముంబై : ముగ్గురు మహిళలు ముంబై లోకల్ ట్రైన్ లేడీస్ కోచ్‌లో సిగపట్లకు దిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్స్ ఆఫ్ ముంబై పేజ్ ట్విట్టర్లో షేర్ చేసిన 31 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా వీక్షించగా 800 రీట్విట్స్ అయ్యాయి. ఈ వీడియోలో ముగ్గురు మహిళలు కిక్కిరిసిఉన్న లోకల్ ట్రైన్ కోచ్‌లో ఒకరినొకరు తోసుకుంటూ జుట్టు పట్టుకుని లాగుతుండటం కనిపించింది.
Spirit of Mumbai – Part 4pic.twitter.com/CoyXl8TrPq
— Roads of Mumbai 🇮🇳 (@RoadsOfMumbai) October 16, 2022
వీడియోలో తొలుత ఓ అమ్మాయి మహిళను కొడుతూ తోసివేస్తుండటం కనిపించింది. ఆపై మరో మహిళ జోక్యం చేసుకుని అమ్మాయిపై దాడికి దిగింది. ట్రైన్లో ఉన్నవారు ముగ్గురిని ఆపేందుకు విఫలయత్నం చేశారు. అరే ఆంటీ వదలండి అని ఓ ప్రయాణీకురాలు అరుస్తుండటం వినిపించింది. మరికొందరు ప్రయాణీకులు తమ సీట్లలో కూర్చుని గొడవ జరుగుతున్నా మౌన ప్రేక్షకుల వలే వ్యవహరించారు.
కాగా గత నెలలోనూ ఇదే తరహా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. థానే-పన్వేల్ లోక్‌ల్ ట్రైన్లో సీటు విషయంలో మహిళలు బాహాబాహీకి దిగిన వీడియో వైరల్‌గా మారింది. వీరిద్దరి మధ్య ఘర్షణను నివారించేందుకు జోక్యం చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సి వచ్చింది.