Ian Botham : చావు అంచుల దాకా వెళ్లి, కొద్దిలో ప్రాణాలతో బయటపడిన వాళ్లను ‘మృత్యుంజయులు’ అంటారని తెలిసిందే. అప్పుడుప్పుడు ఊహించని ప్రమాదాల నుంచి కొందరు ఇలాగే బయటపడుతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బొథామ్ (Ian Botham) కొద్దిలో బతికిపోయాడు. మొసళ్ల నదిలో పడిన అతడి తీవ్ర గాయాలతో ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ రోజు అసలు ఏం జరిగింది.. తనను ఎవరు కాపాడారు? అనే విషయాలను బోథమ్ అభిమానులతో పంచుకున్నాడు.
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ అయిన ఇయాన్ బోథమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఆసీస్ మాజీ ఆటగాడు మెర్వే హ్యూస్‌తో కలిసి చేపలు పట్టేందుకు మొయ్లే నది సమీపానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి పడవలో వెళ్లి నదిలో సరదాగా చేపలు పడుతుండగా.. బోథమ్ కాలి చెప్పు జారి నీళ్లలో పడింది. ఆ చెప్పును తీయబోయిన బోథమ్ ప్రమాదవశాత్తూ నీళ్లలో పడిపోయాడు.
Ian Botham rescued from crocodile and shark infested waters after plunging in headfirsthttps://t.co/GafHVzFEkF pic.twitter.com/6w2sm6KSOL
— Daily Star (@dailystar) November 7, 2024
ఆ నదిలో భారీ షార్క్‌లు, మొసళ్లు ఉంటాయనే విషయం అతడికి తెలియదు. నీళ్లలో పడిన బోథమ్‌ను గమనించిన ఓ భారీ మొసలి గబగబా వచ్చేసింది. అతడిని అమాంతం నోట కరచుకొని తినేయాలని అనుకుంది. వచ్చీ రావడమే ఆలస్యం అతడిపై దాడికి దిగింది. ఏం జరుగుతుందో అర్దమయ్యేలోపే బోథమ్‌ను మొసలి తన దంతాలతో కొరకడం మొదలెట్టింది. ఇదంతా చూసి అప్రమత్తమైన హ్యూస్ పరుగున వెళ్లి బోథమ్‌ను పైకి లాగాడు. అప్పటికే మొసలి దాడిలో బోథమ్ఎడమ వైపు వీపు భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ‘ఆ సమయంలో హ్యూస్ గనుక నన్ను కాపాడకుంటే తన శరీరంలో ముక్క కూడా దొరికేది కాద’ని బోథమ్ ఆ భయంకరమైన రోజును గుర్తు చేసుకున్నాడు.
“There is no one more recognised or identified with English cricket than him.”
📽️ We honour the supreme all-round skills of Ian Botham on #ICCHallOfFame. pic.twitter.com/z34DBEfwRg
— ICC (@ICC) May 30, 2021
ఇంగ్లండ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన బోథమ్ మేటి ఆల్రౌండర్లలో ఒకడు. సుదీర్ఘ కాలం ఇంగ్లండ్ జట్టుకు సేవలందించిన బోథమ్ 1992లో అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిచాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ ఒకేసారి టెస్టులు, వన్డేలకు వీడ్కోలు పలికాడు.