మా ఆవులు అస్సలు పాలివ్వడం లేదు సార్.. గత నాలుగు రోజుల నుంచి అవి పాలు ఇవ్వడం లేదు. రోజూ వాటికి సరిపోయేంత మేత కూడా వేస్తున్నాను. అవి ఎందుకు పాలు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు సార్.. అంటూ ఓ రైతు.. తన ఆవులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా, భద్రావతి తాలుకా.. సిద్లిపురా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడికి సమీపంలో ఉన్న హొలెహొన్నుర్ పోలీస్ స్టేషన్లో రామయ్య అనే రైతు.. తన నాలుగు ఆవులపై ఫిర్యాదు చేశాడు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు మేత కోసం వాటిని అడవికి తీసుకెళ్తా. ఇదివరకు బాగానే పాలు ఇచ్చేవి. కానీ.. నాలుగు రోజుల నుంచి అన్ని ఆవులు పాలు ఇవ్వడం లేదు. మీరే ఎలాగైనా అవి పాలు ఇచ్చేలా చేయండి.. అంటూ తన ఫిర్యాదులో రామయ్య పేర్కొన్నాడు.
పోలీసులు ఆ ఫిర్యాదు చూసి షాక్ అయ్యారు. ఇలాంటి ఫిర్యాదులను తీసుకోమని.. కేసు ఫైల్ చేయడం కుదరదని.. ఆ రైతుకు నచ్చజెప్పి పోలీసులు అక్కడి నుంచి పంపించారు.
గత నెల కూడా మధ్యప్రదేశ్‌లో ఓ రైతు.. తన బర్రె పాలు ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బర్రె పాలు ఇవ్వడానికి నిరాకరిస్తోందని.. తన బర్రెకు ఎవరో చేతబడి చేశారని.. ఫిర్యాదు చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కూతుళ్లకు టీ ఎలా చేయాలో నేర్పించిన యూఎస్ ఫేమస్ డాక్టర్ సంజయ్ గుప్తా: వీడియో వైరల్
Anand Mahindra : 900 మంది ఉద్యోగులను జూమ్ కాల్లో తీసేసిన ఘటనపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
Bipin Rawat : బిపిన్ రావత్‌కు ఘనమైన నివాళి.. దేశమంతా సెల్యూట్: వీడియో వైరల్
కత్రినా, విక్కీ పెళ్లిపై డ్యురెక్స్ కండోమ్ బ్రాండ్ మీమ్ వైరల్
చెరుకు రసం నుంచి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఈ వీడియో చూసి తెలుసుకోండి