హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు జీరంఘాటి కేసులో 10 మంది ఆదివాసీలకు ఈ నెల 16న విధించిన మరణ శిక్ష తీర్పును తక్షణమే రద్దు చేసి, 10 మంది ఆదివాసీలను జైలు నుంచి విడుదల చేయాలని మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు మాజీ నాయకులు దేవ్‌జీ, సంగ్రామ్, చంద్రన్న, మైనక, సంజీవ్, ముప్పిడి సాంబయ్య, దామోదర్, హుస్సేన్, బండి ప్రకాశ్, నరహరి, నూన నర్సింహారెడ్డి, చందు, కంకణాల రాజిరెడ్డి తదితరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. బస్తర్ ప్రాంతంలో విప్లవోద్యమం బలంగా ఉన్న 2013లో జీరంఘాటి వద్ద జరిగిన అంబుష్‌లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు, పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, ఆ ఘటనకు కారకులంటూ అకడి పోలీసులు 10 మంది ఆదివాసీలను అరెస్టు చేసి జైలుకు పంపారని పేర్కొన్నారు.
13 ఏండ్లు గడిచిన తర్వాత వారందరికీ ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించిందని, ఒక న్యాయస్థానం ఒకే కేసులో 10 మందికి మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారని తెలిపారు. అయితే, మన దేశంలో, ఇతర దేశాల్లో ప్రభుత్వ సాయుధ బలగాలకు, సాయుధ పోరాట సంస్థలకు మధ్య ఘర్షణలు, యుద్ధాలు ఎన్నో జరిగాయని, కొ న్నిచోట్ల ప్రభుత్వ సాయుధ బలగాలు పోరాట సంస్థలను అణచివేయగా, కొన్నిచోట్ల శాంతి చర్చల ద్వారా ఇరుపక్షాలు యుద్ధాన్ని విరమించాయని వివరించారు. మరికొన్ని చోట్ల పోరాట సంస్థలు లొంగిపోయాయని పేర్కొన్నారు. సమస్యను రా జకీయంగా పరిషరించడంలో భాగంగా ఇరుపక్షాలు శాంతిని కొనసాగించడానికి తోడ్పడేలా వ్యవహరించాలని కోరారు.
భారత్ మావోయిస్టు రహిత దేశంగా మారిందని ఈ ఏడాది మార్చి 30న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారని మావోయిస్టు మాజీ నేతలు గుర్తుచేశారు. అప్పటినుంచి మావోయిస్టుల వైపు నుంచి ఎకడా సాయుధ చర్యలు జరుగలేదు, శాంతియుత పరిస్థితి కొనసాగుతున్నదని తెలిపారు. ఈ స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలు శాంతిని కొనసాగించడానికి తోడ్పడాలే గానీ, దానిని భంగం చేసేవిగా ఉండకూడదని సూచించారు. న్యాయ ప్రక్రియ ద్వారా కాకుండా రాజకీయ ప్రక్రియ ద్వారా ఈ సమస్యను పరిషరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మావోయిస్టులపై కేసులన్నింటినీ రద్దు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు విడుదల చేయాలని కోరారు. మరణ శిక్షలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని ప్రజాస్వామికవాదులు, న్యాయవాదులు, జర్నలిస్టు లు, హకుల సంఘాలకు విజ్ఞప్తి చేశారు.