MS Dhoni : భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈమధ్యే ఐపీఎల్ 18వ సీజన్లో అతడి క్రేజ్ చూశాం. అతడి పేరు వింటే చాలు అభిమానులకు పూనకాలే. ఇక అతడు మైదానంలోకి వచ్చాడంటే డెసిబెల్స్ డబుల్ అవ్వాల్సిందే. తన ఆటతో, తన కూల్ కెప్టెన్సీతో కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ధోనీ సోమవారం 44వ వసంతంలో అడుగుపెట్టాడు.
ఇంకేముంది తమ హీరోకు పోటీపడీమరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని ధోనీ ఫ్యాన్స్ అయితే ఏకంగా భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టుతో ఉన్న ఎంఎస్డీ కటౌట్‌ను ఆవిష్కరించారు. సీఎస్కే జెర్సీతో ఉన్న మరో పెద్ద కటౌట్‌ను కూడా పెట్టారు. అనంతరం ఈలలు వేస్తూ.. డాన్స్ చేస్తూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ‘ఇండియా కా రాజా ఎంఎస్ ధోనీ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెండు కటౌట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
HAPPY BIRTHDAY TO YOU MS DHONI.
Not just a name, not just a player he’s an emotion, a feeling of calm in every storm.
Happy Birthday to the man who made us believe in miracles. 💙 #HappyBirthdayMSDhoni pic.twitter.com/14c3sdJn1h— SAM ॐ (@SRKzMSD) July 7, 2025
రైల్వే టీసీ నుంచి టీమిండియా సారథిగా ఎదిగిన ధోనీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. అందుకే అతడంటే ఫ్యాన్స్‌కు అంత పిచ్చి. జులపాల జట్టుతో, జెర్సీ నంబర్ 7తో అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన ఈ జార్ఖండ్ డైనమైట్ భారత జట్టుపై చెరగని ముద్రవేశాడు. తన కెప్టెన్సీలో టీమిండియాను మూడుసార్లు ఐసీసీ విజేతగా నిలిపాడు. ఐపీఎల్‌లోనూ తన మార్క్ సారథ్యంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు ట్రోఫీలు కట్టబెట్టాడు తాలా.
వయసు 43కు చేరడంతో నిరుడు రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించిన ధోనీ.. 18వ సీజన్లో అతడి నిష్క్రమణతో మళ్లీ సారథిగా వ్యవహరించాడు. మరో ఎడిషన్ ఆడడంపై ఐదారు నెలల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన మహీ.. తన భవిష్యత్‌పై ఎప్పుడు, ఎలాంటి ప్రకటన చేస్తాడోనని అభిమానులు ఆసక్తితో ఉన్నారు.