మధిర, జులై 07 : రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు స్వర్ణ విజయ్చంద్ర అన్నారు. సోమవారం చింతకాని మండలం పాతర్లపాడులో పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల భూమి జీవశక్తి పెరుగుతుందన్నారు. నీటి నిల్వలు, మట్టి నాణ్యత మెరుగుపడి ఆరోగ్యవంతమైన ఆహారం లభిస్తుందన్నారు.
అదేవిధంగా పంటకు మంచి గిరాకీ ఉంటుందని చెప్పారు. కూరగాయల పంటలను పండించే రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఎన్జీఓ మారయ్య మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయానికి జీవ ఎరువులు, వర్మీ కంపోస్ట్, గోమూత్రం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, ద్రవ జీవామృతం ఆధారిత శీఘ్రకారకాలు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ సోములపల్లి మానస, ఏఈఓ తేజ, కల్యాణి, రైతులు పాల్గొన్నారు.