AFI : అథ్లెటిక్స్‌లో ఈమధ్య తరచుగా డోపింగ్ కేసు(Doping Cases)లు నమోదవుతున్నాయి. అంతర్జాతీ వేదికలపై పలువురు క్రీడాకారులు పట్టుబడుతుండడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించింది భారత అథ్లెటిక్స్ సమాఖ్య (AFI) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో డోపింగ్ భూతాన్ని తరిమేసేందుకు సోమవారం ఏఎఫ్ఐ కఠినమైన నిర్ణయాలు వెలువరించింది. గుర్తింపులేని కోచ్‌ల దగ్గర శిక్షణ పొందిన అథ్లెట్లను జాతీయ అవార్డులకు నామినేట్ చేయకూడదని తీర్మానించింది. ఇకపై రిజిస్టర్ కానీ కోచ్‌ల వద్ద ట్రైనింగ్ తీసుకున్నవాళ్ల పేర్లను అర్జున(Arjuna), ఖేల్ రత్న(Khel Ratna) అవార్డుల పరిశీలనకు పంపబోమని ఏఎఫ్ఏ తేల్చి చెప్పింది.
భారత అథ్లెట్లు నిషేధిత పదార్ధాలు తీసుకొని డోప్ టెస్టులో దొరికిపోతున్న నేపథ్యంలో అథ్లెటిక్ సమాఖ్య ఈమధ్య కొన్ని చర్యలు చేపట్టింది. జాతీయ స్థాయిలో శిక్షకులుగా ఉన్నవాళ్లందరూ తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. జూలై 31లోపు పేర్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. ‘ఈమధ్య కోచ్‌లు, అథ్లెట్ల తల్లిదండ్రులు కూడా డోపింగ్‌కు పాల్పడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అందుకు ఈ భూతాన్ని తరిమేయాలని నిర్ణయించుకున్నాం. మనదేశంలో క్వాలిఫైడ్, క్వాలిఫై కాని కోచ్‌లు ఉన్నారు. వీళ్లంతా తమ పేర్లను నిర్ణీత గడువులోపు రిజిస్టర్ చేసుకుంటారని భావిస్తున్నా.
అడిల్లే సుమరివిల్లా
జూన్ 31లోపు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ల వివరాలను ప్రజలకు వెల్లడిస్తాం. రిజిస్టర్ అయిన వాళ్ల దగ్గరే కోచింగ్ తీసుకోవాలని చెబుతాం. రిజిస్టర్ కానివాళ్లను బ్లాక్ లిస్ట్‌లో చేర్చుతాం’ అని ఏఎఫ్ఐ మీడియ ప్రతినిధి అడిల్లే సుమరివిల్లా (Adille Sumariwalla) వెల్లడించాడు. రెండు రోజుల క్రితం నీరజ్ చోప్రా క్లాసిక్ తొలి సీజన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు అడిల్లే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2029, 2031 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఆతిథ్యానికి బిడ్డింగ్ వేయనుందని తెలిపాడు. ఈ రెండింటిలో ఏ ఒక్క ఎడిషన్ హక్కలు దక్కినా సరే సంతోషమేనని ఆయన చెప్పాడు.