Robbery | కాల్వ శ్రీరాంపూర్ జూలై 7 : ఇంటి ముందుకు కల్లు తాగుతామని నమ్మించి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై ఉన్న బంగరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండలం కూనారం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కునారం గ్రామానికి చెందిన దేవర్ల రాజవ్వ(75) ఒంటరి వృద్ధురాలు తన ఇంటి ముందు కూర్చోగా ఇద్దరు యువకులు బైక్ పై ఇంటికి వచ్చి తాము ఇక్కడ కూర్చొని కల్లు తాగి వెళ్తామని చెప్పి వృద్ధురాలిని నమ్మించారు.
అక్కడే కూర్చొని వృద్ధురాలతో మాట్లాడుతూ వృద్ధురాలు మెడలోని రెండు తులాల బంగారు పుస్తల తాడును తెంపుకొని పారిపోయినట్లు వృద్ధురాలు రాజవ్వ వాపోయారు. వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టూ పక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేష్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.