e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News Spider inside Woman's Ear : మ‌హిళ చెవిలో దూరిన సాలీడు..

Spider inside Woman’s Ear : మ‌హిళ చెవిలో దూరిన సాలీడు..

సాధార‌ణంగా సాలీడును చూస్తే కొంద‌రు షాక్ అవుతారు. చిన్న సాలీడు అయితే ప‌ర్వాలేదు కానీ.. కొన్ని ర‌కాల జాతుల సాలీడులు చూడ‌టానికి చాలా భ‌యంక‌రంగా ఉంటాయి. అలాంటి సాలీడు చెవిలో దూరితే ఇంకేమ‌న్నా ఉందా? చిన్న పురుగు చెవిలో దూరితేనే చాలా నొప్పి పుడుతుంది. అలాంటిది ఓ మ‌హిళ చెవిలోకి సాలీడు దూరింది. దూర‌డ‌మే కాదు అక్క‌డే త‌న నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.

వై అనే మ‌హిళ చెవిలో నొప్పి రావ‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి వెళ్లింది. డాక్ట‌ర్లు త‌న చెవిలో ప‌రీక్ష చేసి చూసి షాక్ అయ్యారు. త‌న చెవిలో సాలీడు దూరింద‌ని చెప్పారు. ఆ త‌ర్వాత ఎల‌క్ట్రిక్ ఓటోస్కోప్‌తో స్పైడ‌ర్‌ను డాక్ట‌ర్లు బ‌యటికి తీశారు. దీంతో ఆ మ‌హిళ ఊపిరి పీల్చుకుంది.

- Advertisement -

2019 లో కూడా ఇలాగే చైనాలో ఓ వ్య‌క్తి చెవిలోకి స్పైడ‌ర్ దూరింది. మైక్రోస్కోప్ సాయంతో ఆ వ్య‌క్తి చెవిలోకి స్పైడ‌ర్ దూరింద‌ని తెలుసుకున్న డాక్ట‌ర్లు వెంట‌నే దాన్ని బ‌య‌టికి తీసేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

70 ఏళ్ల వ‌య‌సులో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వృద్ధురాలు..

Viral Video : ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయ‌డానికి క్రేన్‌నే తీసుకొచ్చారు

Driverless bike : డ్రైవ‌ర్‌లెస్ బైక్ వ‌చ్చేసింది.. ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?

విమానం నుంచి ప‌డిపోయిన మాన‌వ వ్య‌ర్థాలు.. షాకైన తోట య‌జ‌మాని

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement