Artemis II: 10 రోజుల్లో చంద్రుడిని చుట్టిరానున్న వ్యోమగాములు.. ఆర్టెమిస్-2ను లాంచ్ చేసిన నాసా.. వీడియో
Artemis II: కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్-2 మిషన్ను లాంచ్ చేసింది నాసా. నలుగురు వ్యోమగాములు పది రోజుల్లో చంద్రుడిని చుట్టి రానున్నారు. ఓరియన్ క్యాప్సూల్ ద్వారా మళ్లీ ఆ వ్యోమగాములు భూమిపై దిగనున్నారు. సుమారు 50 ఏళ్ల తర్వాత నాసా చంద్రుడి మిషన్ చేపట్టింది.
న్యూఢిల్లీ: ఆర్టెమిస్-2 వ్యోమనౌకను ఇవాళ నాసా లాంచ్ చేసింది. సుమారు 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి వద్దకు వ్యోమగాముల్ని నాసా పంపుతోంది. చరిత్రాత్మకమైన ఆ ట్రిప్లో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. పది రోజుల పాటు రోదసిలో ఆ ఆస్ట్రోనాట్స్ ప్రయాణం చేస్తారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి రాకెట్ ఎగిరింది. రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్తో పాటు జెర్మీ హన్సెన్ ఆ మూన్ రాకెట్లో ఉన్నారు. పది రోజుల జర్నీలో భాగంగా ఆస్ట్రోనాట్స్.. చంద్రుడిని చుట్టి వస్తారు. జాబిలిని సర్కిల్ వేసిన తర్వాత మళ్లీ భూమి పైకి వ్యోమగాములు రానున్నారు. ఓరియన్ క్యాప్సూల్లో వాళ్లు ల్యాండ్ అవుతారు.
1972లో చేపట్టిన అపోలో 17 మిషన్ తర్వాత లో ఎర్త్ ఆర్బిట్లో చేపట్టిన మొదటి మిసన్ ఇదే కావడం గమనార్హం. ఏప్రిల్ ఆరవ తేదీన ఓరియన్ క్యాప్సూల్.. చంద్రుడి చుట్టూ తిరగనున్నది. చరిత్రలో తొలిసారి ఆస్ట్రోనాట్స్ భూమికి దూరంగా ప్రయాణం చేయనున్నారు. గతంలో అపోలో 13 మిషన్లో భాగంగా ఆస్ట్రోనాట్స్ 400,171 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అయితే ప్రస్తుతం ఆర్టెమిస్-2లో వెళ్తున్న వ్యోమగాములు ఆ దూరాన్ని బ్రేక్ చేయనున్నారు.
Liftoff.
The Artemis II mission launched from @NASAKennedy at 6:35pm ET (2235 UTC), propelling four astronauts on a journey around the Moon.
Artemis II will pave the way for future Moon landings, as well as the next giant leap — astronauts on Mars. pic.twitter.com/ENQA4RTqAc
— NASA (@NASA) April 1, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

