రూపాయి కాదు.. రెండు రూపాయలు కాదు.. ఏకంగా 24 లక్షల రూపాయలు పెట్టి మరీ ఓ జంట ప్రైవేట్ జెట్‌ను బుక్ చేసింది. అది కూడా ఓ చోట చిక్కుకుపోయిన తమ పెట్ డాగ్ కోసం. విచిత్రంగా ఉంది కదా.. పెట్ డాగ్ కోసం అంత డబ్బు ఖర్చు చేసి స్పెషల్‌గా ప్రైవేట్ జెట్‌నే బుక్ చేయడం ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది కదా.. పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాకు చెందిన టాష్ కార్బిన్, తన భర్త డేవిడ్ డైనెస్లకు ఒక పెట్ డాగ్ ఉంది. దాని పేరు మంచ్కిన్. అది ఇండోనేషియాలోని బాలిలో ఓ వీధికుక్క. ఆ కుక్క చిన్నపిల్లలా ఉన్నప్పుడే దాన్ని బాలీలో ఈ జంట పెంచుకోవడానికి తమతో పాటు తీసుకున్నారు. కానీ.. బాలీ నుంచి విమానాల్లో ఆస్ట్రేలియాకు పెట్ డాగ్స్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో.. దాన్ని మూడేళ్ల పాటు సింగపూర్‌లో ఉంచారట. సింగపూర్ నుంచి 2019లో దాన్ని న్యూజిలాండ్‌కు పంపించారట.
ఇక అప్పటి నుంచి అది న్యూజిలాండ్‌లోనే ఉందట. 2019లోనే న్యూజిలాండ్‌కు కార్బిన్, డేవిడ్.. ఇద్దరూ తమ పెట్ డాగ్ కోసం వెళ్లినప్పటికీ.. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు పెట్ డాగ్ ఎంట్రీకి నో చెప్పారట అధికారులు.
దీంతో ఆస్ట్రేలియా అధికారుల గ్రీన్ సిగ్నల్ కోసం వాళ్లు కొన్ని రోజులు వెయిట్ చేశాక.. కార్బిన్ మాత్రం ఆస్ట్రేలియా తిరిగి వెళ్లిపోగా.. తన భర్త డేవిడ్.. మంచ్కిన్తో అక్కడే న్యూజిలాండ్‌లో ఉండిపోయాడు.
ఐదు నెలలు అవుతున్నా ఆస్ట్రేలియా అధికారుల నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పాటు.. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుండటంతో ఇక చేసేది లేక.. కార్బిన్.. ప్రైవేట్ జెట్‌ను బుక్ చేసి.. తన భర్త, మంచ్కిన్ను ఆస్ట్రేలియా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దాని కోసం కనీసం 24 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి.
త్వరలో క్రిస్మస్ రానుంది. ఈ సమయంలో అందరం కలిసి పండుగ జరుపుకోవాలి. అందుకే ఎంత ఖర్చయినా సరే.. మంచ్కిన్ను ఈసారి ఆస్ట్రేలియాకు తీసుకొచ్చి తీరుతానని చెప్పుకొచ్చింది కార్బిన్.
అయితే.. ప్రైవేట్ జెట్‌ను అద్దెకు తీసుకొని.. అందులో న్యూజిలాండ్ నుంచి ఇంకా వేరే ఎవరైనా ప్రయాణికులు ఆస్ట్రేలియాకు వచ్చేవాళ్లు ఉంటే.. వాళ్లను అదే ఫ్లైట్‌లో తీసుకొచ్చి.. తన ఖర్చును తగ్గించుకోవాలని కార్బిన్ ప్లాన్ వేసింది. ప్రస్తుతం ఫండ్స్ కోసం, ఇతర ప్యాసెంజర్ల కోసం కార్బిన్ వెయిట్ చేస్తోంది. లేదంటే.. తనే ఆ డబ్బులు పెట్టి క్రిస్మస్ లోపు ఎలాగైనా పెట్ డాగ్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఇవే
Bipin Rawat | తండ్రి బాటలో సైన్యంలోకి.. ట్రబుల్ షూటర్‌గా దేశానికి సేవ