Dalal Street : భారత స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 564 పాయింట్లు లాభపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లు లాభపడింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఉదయం 74,535.18 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గరిష్టంగా 74,987.40 పాయింట్లకు చేరుకోగా.. కనిష్టంగా 74,454.18 పాయింట్లకు చేరింది. రోజులో సగటున 533.22 పాయింట్లు దూసుకెళ్లింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి గరిష్టంగా 564.03 పాయింట్ల (0.76%) లాభంతో 74,858.99 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 67.90 పాయింట్లు (0.29%) లాభంతో 23,414.30 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం పడిపోయింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.04 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ 30 షేర్ ఇండెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్ అత్యధికంగా 4.11 శాతం లాభపడింది.
ఆ తర్వాత హెచ్‌సీఎల్ టెక్ 3.42 శాతం, ఎటర్నల్ 2.59 శాతం, టైటాన్ 2.49 శాతం, ఐటీసీ 1.93 శాతం లాభపడ్డాయి. సన్ ఫార్మా, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ కూడా లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం మార్కెట్‌ను లాభాలబాటపట్టేలా చేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.11 శాతం తగ్గి, 95.81 వద్ద కొనసాగుతోంది. చమురు ధరలు 7 శాతం తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 91.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.