Arrhythmia | అరిథ్మియా అంటే ఏమిటి.. దీనికి, గుండె కొట్టుకోవడానికి ఏమిటి సంబంధం..?
సాధారణంగా గుండె రోజుకు లక్ష సార్లకు పైగా కొట్టుకుంటూ శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సమర్థవంతంగా సరఫరా చేస్తుంది. గుండె కొట్టుకునే లయలో మార్పులు వచ్చినప్పుడు దాన్ని అరిథ్మియా అంటారు. గుండె చాలా వేగంగా కొట్టుకోవడం, చాలా నెమ్మదిగా కొట్టుకోవడం లేదా క్రమం తప్పిన లయలో కొట్టుకోవడం దీని లక్షణాలుగా ఉంటాయి.
Arrhythmia | సాధారణంగా గుండె రోజుకు లక్ష సార్లకు పైగా కొట్టుకుంటూ శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సమర్థవంతంగా సరఫరా చేస్తుంది. గుండె కొట్టుకునే లయలో మార్పులు వచ్చినప్పుడు దాన్ని అరిథ్మియా అంటారు. గుండె చాలా వేగంగా కొట్టుకోవడం, చాలా నెమ్మదిగా కొట్టుకోవడం లేదా క్రమం తప్పిన లయలో కొట్టుకోవడం దీని లక్షణాలుగా ఉంటాయి. ప్రతి అరిథ్మియా ప్రమాదకరమైనదే అని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో ఎలాంటి హాని ఉండదు. అయితే కొన్ని రకాల అరిథ్మియాలు తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉండడంతో లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
ఒక్కసారిగా పెరిగే గుండె వేగం..
గుండె కొట్టుకునే లయను నియంత్రించే విద్యుత్ వ్యవస్థలో సైనస్ నోడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఏర్పడే విద్యుత్ సంకేతాలు మొదట గుండె పై గదులకు, ఆ తర్వాత ఏవీ నోడ్ ద్వారా కింది గదులకు చేరుతాయి. ఈ సంకేతాల ఉత్పత్తిలో వేగం లేదా క్రమంలో మార్పు వచ్చినప్పుడు గుండె లయలో అసాధారణత ఏర్పడుతుంది. సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియాలో గుండె వేగం ఒక్కసారిగా నిమిషానికి 150 నుంచి 180 లేదా అంతకంటే ఎక్కువకు పెరుగుతుంది. గుండె దడ, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచూ వచ్చే సందర్భాల్లో పరిస్థితిని బట్టి ప్రత్యేక చికిత్స అవసరం అవుతుంది.
రకాలేంటి..
ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఏట్రియల్ ఫ్లట్టర్ కూడా అరిథ్మియాలో ముఖ్యమైన రకాలు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో గుండె పై గదులు సక్రమంగా సంకోచించకుండా వణుకుతాయి. దీంతో గుండె కొట్టుకునే లయ క్రమం తప్పుతుంది. కొందరిలో గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే పరీక్షల్లో బయటపడుతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో రక్తం గుండెలో నిలిచిపోయి గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ గడ్డ రక్తప్రవాహం ద్వారా మెదడుకు చేరితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉండడంతో కొంతమందికి రక్తం గడ్డకట్టకుండా చేసే మందులు అవసరం అవుతాయి. అలాగే కొందరిలో గుండె అదనపు స్పందనలు, వెంట్రిక్యులర్ టాకీకార్డియా వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి.
60 కంటే తక్కువగా ఉంటే..
గుండె స్పందన నిమిషానికి 60 కంటే తక్కువగా ఉండడం ప్రతిసారీ అసాధారణం కాదు. శారీరక దారుఢ్యం ఉన్నవారిలో ఇది సహజంగానే ఉంటుంది. అయితే శరీరానికి అవసరమైనంత రక్తాన్ని సరఫరా చేయలేనంతగా గుండె స్పందన తగ్గితే అలసట, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, వ్యాయామం చేయలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అరిథ్మియా ఉన్నట్లు అనుమానం ఉంటే ముందుగా ఈసీజీ పరీక్ష చేయవచ్చు. లక్షణాలు ఎంత తరచూ వస్తున్నాయనే దాన్ని బట్టి హోల్టర్ లేదా ఈవెంట్ మానిటరింగ్, అవసరమైతే ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలను సూచిస్తారు. అరిథ్మియా కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేకపోయినా, నిర్లక్ష్యం చేయకుండా కారణాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

