స్కూళ్లలో రోజురోజుకూ విద్యార్థుల మీద దాడులు ఎక్కువవుతున్నాయి. విద్యార్థులు చదవకపోతే.. వాళ్లను బుజ్జగించడమో.. లేక బెదిరించడమో చేసి వాళ్లు చదువుకునేలా చేయడం టీచర్ల బాధ్యత. కానీ.. కొందరు టీచర్లు దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకొని విద్యార్థులను ప్రతి చిన్న విషయానికి దండిస్తున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే పిల్లలు మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నారు.
ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి అయినా కూడా ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా యూపీలో ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రెండో తరగతి చదివే విద్యార్థిని హెడ్మాస్టర్ బిల్డింగ్ మీది నుంచి కిందకు వేలాడదీశాడు.
మీర్జాపూర్‌లోని ఓ పాఠశాల హెడ్మాస్టర్.. మనోజ్ విశ్వకర్మ.. రెండో తరగతి చదివే విద్యార్థిని తీసుకెళ్లి బిల్డింగ్ మీది నుంచి తల కిందులుగా వేలాడదీశాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెంటనే పిల్లలంతా అక్కడ గుమికూడారు. ఆ పిల్లాడు భయంతో ఏడుస్తున్నాడు. హెడ్ మాస్టర్ సారీ చెబితేనే కిందికి దించుతానంటూ ఆ పిల్లాడిని బెదిరిస్తున్నాడు.
ఇంతలో తోటి విద్యార్థులు గట్టిగా అరవడంతో ఆ హెడ్ మాస్టర్ పిల్లాడిని కిందికి దించాడు. అయితే.. హెడ్మాస్టర్ చేసిన పనిని కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న పిల్లాడి తల్లిదండ్రులు వెంటనే ఆ హెడ్మాస్టర్పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద బుక్ చేశారు.
సోనూ చాలా అల్లరి పిల్లాడు. తుంటరి పనులు చేస్తుంటాడు. తోటి విద్యార్థులను కొరుకుతుంటాడు. టీచర్లను కూడా కొరుకుతాడు. అతడి తండ్రే.. కొంచెం హద్దుల్లో పెట్టండి అని చెప్పాడు. అందుకే.. అతడిని భయపెట్టేందుకు అలా చేశాం కానీ.. ఆ పిల్లాడిని ఏదో చేయాలని కాదు అని హెడ్మాస్టర్ మీడియాకు తెలిపాడు.
This teacher also seems to have been inspired by #Godse:
— Abhayjit singh(अभयजीत सिंह) (@abhayjitsandhu) October 28, 2021
In a school in #Mirzapur-Ahraura, #uttarpradesh student studying in class 2nd did mischief, then the teacher grabbed his feet and hanged him from the building. pic.twitter.com/9whomOUHaN
#UPPolice #Mzp pic.twitter.com/1Yo07qhvEN
— Mirzapur Police (@mirzapurpolice) October 28, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Penis Plant : ఈ పువ్వు పూయడమే చాలా అరుదు.. దీని దగ్గరికి వెళ్తే కంపు వాసన
Model Photoshoot : తండ్రి శవం పక్కన మోడల్ ఫోటోషూట్.. నువ్వు మనిషివేనా అంటున్న నెటిజన్లు
పెండ్లికి ముందే శృంగారం.. మైనర్ బాలికకు గర్భం.. యూట్యూబ్ వీడియో చూస్తూ సీక్రెట్‌గా డెలివరీ..!
Squid Game : స్క్విడ్ గేమ్ వీఐపీ యాక్టర్ గెయోఫ్రే గుర్తున్నాడా? ఆయనకు ఇండియాతో కనెక్షన్ ఉందట
Alligator Attacks Man : ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?