చాలామందికి పువ్వులు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మహిళలు పువ్వులను ఎక్కువగా ఇష్టపడతారు. గులాబీ పువ్వు దగ్గర్నుంచి.. మల్లెపువ్వు, కనకాంబ్రాలు.. ఇలా పలు రకాల పువ్వులను మహిళలు తలలో ధరిస్తారు. దేవుడికి కూడా పువ్వులను సమర్పిస్తారు. పండుగల సమయంలో ఇంటి ముందు పూల దండలు కూడా కడుతుంటారు. పువ్వులతో మనుషులకు ఉన్న బంధం అటువంటిది.
మామూలుగా ఏ పువ్వు అయినా మంచి వాసనను వెదజల్లుతుంది. కానీ.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పువ్వు మాత్రం కంపు వాసనను వెదజల్లుతుంది. దాని దగ్గరికి వెళ్తే చాలు.. దుర్వాసన, మనిషి చనిపోయిన తర్వాత శవం నుంచి వచ్చే వాసనలా ఉంటుంది దాని నుంచి వచ్చే వాసన. అయితే.. ఈ పువ్వు ఎప్పుడూ పూయదు. చాలా అరుదుగా పూస్తుంది. చాలా అరుదుగా ఇప్పటి వరకు ఇది పూసింది కేవలం మూడు సార్లు మాత్రమే.
ఇది చూడటానికి అచ్చం మగవాళ్ల ప్రైవేట్ పార్ట్‌లా ఉంటుందని దీనికి పెనిస్ ప్లాంట్ అనే పేరు పెట్టారు. కార్ప్స్ ఫ్లవర్(శవం పువ్వు) అని కూడా దీన్ని పిలుస్తారు. తాజాగా ఇది యూరప్‌లో పూసింది. ఈ పువ్వు చరిత్రలోనే ఇది పూయడం ఇది మూడోసారి. ఇది ఈగలు, ఇతర కీటకాలను ఆకర్షిస్తుంది. చాలా పెద్దగా, పొడవుగా ఉంటుంది ఈ పువ్వు. చాలా వేడిగా, చాలా తేమతో కూడా వాతావరణం ఉంటేనే ఈ పువ్వు పూస్తుంది.
ఇదివరకు ఒకసారి ఇండోనేషియాలోని జావా ఐలాండ్‌లో ఈ పువ్వు పూసింది. తాజాగా యూరప్‌లోని నెదర్లాండ్స్‌లో ఈ పువ్వు పూసింది. ఆ పువ్వు పూసిందని తెలుసుకున్న స్థానికులు దాన్ని చూడటానికి, ఫోటోలు తీయడానికి ఎగబడుతున్నారు. అలాగే.. దాని షేప్‌ను చూసి కూడా తమలో తామే నవ్వుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Model Photoshoot : తండ్రి శవం పక్కన మోడల్ ఫోటోషూట్.. నువ్వు మనిషివేనా అంటున్న నెటిజన్లు
పెండ్లికి ముందే శృంగారం.. మైనర్ బాలికకు గర్భం.. యూట్యూబ్ వీడియో చూస్తూ సీక్రెట్‌గా డెలివరీ..!
Squid Game : స్క్విడ్ గేమ్ వీఐపీ యాక్టర్ గెయోఫ్రే గుర్తున్నాడా? ఆయనకు ఇండియాతో కనెక్షన్ ఉందట
Alligator Attacks Man : ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?