ఒక ఎద్దు విలువ ఎంతుంటుంది చెప్పండి. మా అంటే 50 వేలు.. లేదంటే లక్ష వేసుకోండి. అంతకుమించి ఎక్కువైతే ఉండదు. ఒకవేళ ఒంగోలు జాతి గిత్తలు అయితే కొంచెం ఎక్కువ ధర పలుకుతుందేమో అంతే. కానీ.. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న ఎద్దు విలువ ఎంత తెలుసా.. కోటి. అక్షరాలా కోటి రూపాయలు. కోటి రూపాయలు అనగానే మీరు నోరెళ్లబెట్టి ఉంటారు.
మీరు ఆశ్చర్యపోయినా.. పోకున్నా.. దాని విలువ కోటి రూపాయలే. ఎందుకు దానికి అంత విలువ. అయినా.. దాన్ని అంత డబ్బు పెట్టి ఎవరు కొంటారు అంటారా? అయితే.. దాని సత్తా ఏంటో మీరు తెలుసుకోవాల్సిందే.
ఆ ఎద్దు హల్లికర్ జాతికి చెందినది. దాని పేరు కృష్ణ. బెంగళూరులో ఇటీవల జరిగిన కృషి మేళాలో అదే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దాని ఓనర్ బోరెగౌడ ఏమంటాడంటే.. ఆ ఎద్దు.. అన్ని జాతుల్లో మేలైన జాతి అని.. ఈ జాతి ఎద్దులు చాలా అరుదుగా ఉంటాయని తెలిపాడు.
ఈ జాతి ఎద్దు అరుదు కాబట్టి.. దాని వీర్యానికి చాలా డిమాండ్ ఉంటుంది. వీర్యం ఒక్క డోస్‌కు వెయ్యి రూపాయలు తీసుకొని అమ్ముతాం.. అంటూ చెప్పుకొచ్చాడు.
ఈసారి కృష్ణమేళాలో 12000 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మేళలో వ్యవసాయంలో లాభాలు గడించడం కోసం రైతులు ఎటువంటి పంటలు వేయాలి.. ఎటువంటి ఎరువులు వాడాలి.. హైబ్రిడ్ క్రాప్స్‌లో ఉన్న రకాల గురించి వ్యవసాయ నిపుణులు రైతులకు వివరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ బామ్మ వయసు 105 ఏళ్లు.. అయినా పరుగుపందెంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది
ఆ ఐలాండ్‌లో మహిళలదే రాజ్యం.. వాళ్లదే పైచేయి.. మరి పురుషులు ఏం చేస్తారు?
Dwarfs : ఆ ఊళ్లో సగం మంది మరుగుజ్జులే.. కారణం ఏంటో తెలుసా?