హోంగార్డు ఆత్మహత్య!
నాగర్కర్నూల్ జిల్లాలో చెంచువర్గానికి చెందిన హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ చెంచుగూడెంకు చెందిన బయ్యన్న (46) కోడేరు పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
- ఎస్సై వేధిస్తున్నాడంటూ చివరి మాటలు!
- సోషల్మీడియాలో ఆడియో వైరల్
కొల్లాపూర్, ఏప్రిల్ 1: నాగర్కర్నూల్ జిల్లాలో చెంచువర్గానికి చెందిన హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ చెంచుగూడెంకు చెందిన బయ్యన్న (46) కోడేరు పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సలేశ్వరం జాతర సందర్భంగా విధుల్లో ఉన్న ఆయన విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అధికారుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చనిపోవడానికి ముందు హోంగార్డు మాట్లాడిన చివరి మాటల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాలిలా ఉన్నాయి.
సలేశ్వరం జాతర సందర్భంగా అధికారులు బయ్యన్నకు బందోబస్తు డ్యూటీ వేసినట్టు తెలుస్తున్నది. మంగళవారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన బయ్యన్నను ఫోన్లో ఎవరో తిడుతున్నట్టు మృతుడి రెండో భార్యతోపాటు ఇంటి చుట్టుపక్కలవారు గమనించారు. బుధవారం జాతర డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన బయ్యన్న.. కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎల్లూరుకు చెందిన మల్లయ్యతో బయ్యన్న మాట్లాడిన వీడియో ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఉన్నది. ఎస్సై తనను కులంపేరుతో, కుటుంబసభ్యుల ముందే తిట్టాడని.. అందువల్లే విషం తాగానని బయ్యన్న చెప్తున్నట్టు ఆడియోలో ఉన్నది. ఈ ఆడియో వైరల్ కావడం పోలీసుశాఖలో కలకలం రేపుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

