న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అమెరికా సుప్రీంకోర్టులో మౌఖిక వాదనలు వినేందుకు హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. దేశంలో అక్రమంగా లేదా తాత్కాలిక వీసాల కింద నివసిస్తున్న దంపతులకు అమెరికాలో జన్మించిన పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వ హక్కును ముగించేందుకు ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. బుధవారం ఉదయం ఆయన వైట్‌హౌస్ నుంచి సుప్రీంకోర్టుకు బయల్దేరారు. సాధారణంగా అధ్యక్షులు సుప్రీంకోర్టు విచారణలకు హాజరుకారు. అయితే ట్రంప్ సుప్రీంకోర్టులో హాజరుకావడం ఈ కేసును ఆయన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నట్లు కన్పించి ంది. అయితే న్యాయమూర్తుల తీర్పుపై ఇది ఏమాత్రం ప్రభావితం చూపబోదని నిపుణులు చెప్పారు.