హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీకి పాల్పడుతున్నదని పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించా రు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో, ఆ లక్ష్యం నెరవేరడం లేదని మండిపడ్డారు. రాష్ర్టా న్ని కాంగ్రెస్ అప్పుల కుప్పగా మార్చి ందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ పోరాటాన్ని నవ్వులపాలు చేసేలా నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీలో 8 విమానాశ్రయాలుఉంటే, తెలంగాణలో ఒక్కటే ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వాలు తెలంగాణను నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు.