Viral News | డోక్సూరి తుపాను (Typhoon Doksuri) విధ్వంసం కారణంగా ఫిలిప్పీన్స్ (Philippines) లో వరదలు (Floods) సంభవించాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లు, కార్యాలయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో అధైర్యపడకుండా ఓ జంట వివాహం చేసుకుంది.
మేయి, పాలో పాడిల్లా జంటకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే తుపాను కారణంగా వరదలు పోటెత్తడంతో కాబోయే కొత్త జంట అయోమయంలో పడింది. అయినా అధైర్యపడకుండా వరదలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ముందుగా నిశ్చయించుకున్న ప్రకారమే వరద నీటితో నిండిన ఓ చర్చిలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైంది. దాదాపు అడుగుమేర నీటిలో వధువు నడుచుకుంటూ వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Shehbaz Sharif | అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ తో చర్చకు సిద్ధం : పాక్ ప్రధాని
Manipur Violence | మణిపూర్ అల్లర్లు.. మూడు నెలల్లో 30 మంది అదృశ్యం..!
China Floods | చైనాలో వరద బీభత్సం.. 20 మంది మృతి