ఈమధ్య మోటోవ్లాగ్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాలను చుట్టి వచ్చి.. ఆ ప్రదేశాలను కవర్ చేసిన వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటారు. బైక్ మీద వెళ్తూ కూడా వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. అయితే.. అన్ని రోడ్లు ఒకేలా ఉండవు కదా. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అక్కడ డ్రైవ్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి.
కొందరు మోటో వ్లాగర్స్.. కశ్మీర్ వాలీ, లడక్ మధ్య ఉన్న జొజిలా పాస్ గుండా ప్రయాణిస్తున్నారు. అది కూడా చాలా ప్రమాదకరమైన రోడ్డే. చుట్టూ ఎత్తైన కొండలు, కింద లోయలు.. రోడ్డు చూస్తే గతుకులు. ఒక పెద్ద వాహనం ఏదైనా వెళ్తుందంటే దాన్ని క్రాస్ చేయడం అసంభవం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనంతో సహా లోయలో పడిపోవాల్సిందే.
ఆ రోడ్డు నుంచి వెళ్తున్నప్పుడు ఓ బైకర్ తృటిలో ప్రాణాలను కాపాడుకున్నాడు. లేదంటే బైక్‌తో సహా లోయలో పడిపోయేవాడే. కొందరు బైకర్స్ జొజిలా పాస్ నుంచి వెళ్తున్నారు. అదే సమయంలో ముందు పెద్ద ట్రక్.. వెనుక పైపుల లోడ్‌తో వెళ్తోంది. ఓ బైకర్.. దాన్ని రైట్ సైడ్ నుంచి క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆ రోడ్డు మొత్తం బురద బురదగా ఉండటం.. ట్రక్ దగ్గరికి బైక్ వెళ్లగానే బైక్ స్కిడ్ అయింది. బైక్ అదుపుతప్పింది. పక్కనే లోయ కానీ.. ఆ బైకర్ సమయస్ఫూర్తితో వెంటనే కాలు కిందపెట్టి కిందపడకుండా తనను తాను కాపాడుకోగలిగాడు. ఈ ఘటన గత నెల జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ బామ్మ వయసు 105 ఏళ్లు.. అయినా పరుగుపందెంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది
ఆ ఐలాండ్‌లో మహిళలదే రాజ్యం.. వాళ్లదే పైచేయి.. మరి పురుషులు ఏం చేస్తారు?