ఎలుగుబంట్లు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వస్తుంటాయి. వాటిని చూసి జనం బెంబేలెత్తిపోతుంటారు.అయితే, అమెరికాలో ఓ ఎలుగుబంటి గోడదూకి నేరుగా ఇంటికే వచ్చేసింది. ఇంటి డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సీసీటీవీ ఫుటేజీ క్లిప్‌ను న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఫేస్బుక్లో షేర్ చేసింది. కచ్చితంగా ఆ ఇల్లు ఎక్కడుందో అధికారులు పేర్కొనలేదు. ఈ వీడియోలో గోడదూకి వచ్చిన ఎలుగుబంటి తన పళ్లతో డోర్ ముందుభాగాన్ని తెరుస్తుంది. అయితే, వెనుక ఉన్న చెక్క తలుపును తెరవలేకపోతుంది. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోతుంది. వేసవితాపం తట్టుకోలేక ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తాయని, ప్రజలు వాటికోసం ఆహారాన్ని బయటే ఉంచాలని అధికారులు సూచించారు.