సాధారణంగా.. ప్రేమికుల మధ్య బ్రేకప్ అయితే ఏం చేస్తారు. కొన్నిరోజుల తర్వాత తమ తప్పు తెలుసుకొని కలుస్తారు. లేదంటే.. ఇంకొకరికి వెతుక్కుంటారు. కానీ.. ఈ యువతి మాత్రం తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక్అప్ అయ్యాక.. ఇంకెవరీ ప్రేమించలేదు.. ఇంకెవరితో రిలేషన్షిప్ మెయిన్‌టెన్ చేయలేదు. చివరకు.. తనను తానే పెళ్లి చేసుకుంది.
ఎవరినో చేసుకొని.. ఇబ్బందులు పడటం ఎందుకు. మనల్ని మనం ప్రేమించినంతగా ఎవ్వరినీ ప్రేమించలేము. అందుకే.. నన్ను నేనే పెళ్లి చేసుకుంటున్నా.. అని ప్రకటించిన ఆ యువతి.. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య తనను తానే పెళ్లిచేసుకుంది. తనకు తానే రింగ్ తొడుక్కుంది.
ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటు చేసుకుంది. పాట్రీసియా క్రిస్టినే అనే యువతి గురించే మనం మాట్లాడుకునేది. ఏమ్మా.. 30 ఏళ్లు దగ్గరికి వచ్చాయి.. ఇంకా పెళ్లి చేసుకోవా.. అంటూ ఇరుగు పొరుగు, బంధువులు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక.. ఇక లాభం లేదనుకొని.. తనను తానే పెళ్లి చేసుకుంది.
నిజానికి.. తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. కానీ.. 8 ఏళ్ల క్రితమే తన బాయ్‌ఫ్రెండ్‌తో తనకు కటీఫ్ అయింది. దీంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ.. చివరకు గత సంవత్సరం మే 2020లో తననే పెళ్లి చేసుకుంది. తన పెళ్లి కోసం తను పెట్టిన ఖర్చు 5000 రూపాయలు. అది కూడా తన వెడ్డింగ్ రింగ్, పూలు, వెడ్డింగ్ డ్రెస్ కోసం కేవలం 5000 రూపాయలు ఖర్చు పెట్టి.. తను తన పెళ్లిని జరుపుకుంది. తన పెళ్లి సెరమనీ కూడా కేవలం 30 నిమిషాలే జరిగిందట. ఓ పార్క్‌లో కేవలం తన 9 మంది బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య తన వివాహాన్ని జరుపుకుంది.
తనకు తానే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంది. అయితే.. తనను తానే పెళ్లి చేసుకున్నప్పటికీ.. భవిష్యత్తులో తనకు నచ్చే వ్యక్తి తగిలితే మాత్రం ఖచ్చితంగా అతడిని పెళ్లి చేసుకుంటా.. అని చెబుతోంది పాట్రీసియా. అప్పటి వరకు మాత్రం.. తన గోల్స్ మీద, తనను తాను ప్రేమించుకోవడం మీద దృష్టి పెడుతుందట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి