ఎమ్మెల్యే గాంధీకి ఈడీ సమన్లు!
సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐవీఐపీఎల్)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకున్నది. ఈ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న గాంధీని విచారణకు పిలిచిన ఈడీ అధికారులు.. కొన్ని ఆర్థిక లావాదేవీలపై వివరణ ఇవ్వాలని కోరారు.
- సాహితీ ఇన్ఫ్రాతో సంబంధంపై ఆరా.. 2.1 కోట్ల లావాదేవీలపై 27న విచారణ
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐవీఐపీఎల్)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకున్నది. ఈ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న గాంధీని విచారణకు పిలిచిన ఈడీ అధికారులు.. కొన్ని ఆర్థిక లావాదేవీలపై వివరణ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే గాంధీకి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోకి సాహితీ ఇన్ఫ్రాటెక్ నుంచి సుమారు రూ.2.1 కోట్లు బదిలీ అయినట్టు అధికారులు పేరొంటున్నారు.
ఈ డబ్బు ఎందుకు బదిలీ అయింది? దాని వెనుక ఉన్న లావాదేవీ స్వభావం ఏమిటి? దానికి చట్టబద్ధమైన వ్యాపార ఆధారం ఉన్నదా? అనే అంశాలను ఈడీ ఆరా తీస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్కు చెందిన ఎస్ఐవీఐపీఎల్ దాని అనుబంధ సంస్థలు వివిధ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల పేరుతో కొనుగోలుదారులను ఆకర్షించాయి. ప్రధానంగా ‘ప్రీ-లాంచ్ ఆఫర్’ పేరుతో ఫ్లాట్లు, విల్లాలు తకువ ధరకు ఇస్తామని చెప్పి కొనుగోలుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడంతో పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో తొలుత సుమారు రూ.248 కోట్ల మోసం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత 2024లో దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో ఈడీ, సాహితీ ఇన్ ఫ్రాటెక్ ద్వారా రూ.842.15 కోట్ల మేర ‘ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్’ జరిగినట్టు పేర్కొన్నది. ఇందులో రూ.216.91 కోట్లు నగదు రూపంలో సేకరించి కంపెనీ ఖాతాల్లో నమోదు చేయకుండా దాచినట్టు దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
అరికెపూడికి సాహితీతో లింకు ఏంది?
సాహితీ ఇన్ఫ్రాటెక్ నుంచి గాంధీ బ్యాంకు ఖాతాల్లోకి సుమారు రూ.2.1 కోట్ల నిధులు వెళ్లినట్టు ఈడీ గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఈ డబ్బు ఎందుకు వచ్చింది? ఏదైనా వ్యాపార లావాదేవీకి ప్రతిఫలమా? ఏదైనా ఆస్తి/ప్రాపర్టీ లావాదేవీకి సంబంధించినదా? దర్యాప్తులో పేరొన్న నిధుల మళ్లింపు చైన్లో గాంధీకి భాగముందా? అనే విషయాలు ఈడీ విచారణలో స్పష్టమయ్యే అవకాశం ఉంది. మనీలాండరింగ్ కేసుల్లో డబ్బు ఎకడి నుంచి వచ్చింది? ఎవరికి వెళ్లింది?ఎందుకు వెళ్లింది? దాని వెనుక ఉన్న లావాదేవీ ఏమిటి? అనే ‘మనీ ట్రెయిల్’ను ఈడీ పరిశీలిస్తుంది. నోటీసులపై గాంధీ స్పందిస్తూ.. తాము కొంత మొత్తాన్ని 2018లో ఆఫీసు స్థలం కోసం సాహితీ సంస్థకు అడ్వాన్స్ చెల్లించామని, వారు స్థలం కేటాయించలేదని, కొంతకాలం తరువాత కొంత మొత్తం తిరిగి ఇచ్చేశారని చెపారు. ఇదే కేసులో నటుడు జగపతిబాబును ఈడీ విచారించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

