అంబులెన్స్ నడిపే డ్రైవర్‌కు ఎంత జీతం ఉంటుంది చెప్పండి. మా.. అంటే 10 వేలు కూడా ఉండదు. అటువంటి వ్యక్తి ఒక రోజు కోటీశ్వరుడు అవుతాడని కలలో కూడా అనుకోడు. కానీ.. ఈ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం కలలో కూడా తాను కోటీశ్వరుడిని అవుతానని రోజూ కలలు కనేవాడట. ఒకరోజు నిజంగానే కోటీశ్వరుడు అయిపోయాడట. ఆశ్చర్యంగా ఉంది కదా.. పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బార్ధామాన్ జిల్లాకు చెందిన షేక్ హీరాకు లాటరీ టికెట్లు కొనడం అంటే పిచ్చి. రోజూ ఒక లాటరీ టికెట్ కొంటూ ఉండేవాడు. ఒకరోజు రూ.270 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. ఉదయం టికెట్ కొన్నాడు.. మధ్యాహ్నానికి కోటీశ్వరుడు అయ్యాడు. అతడి లాటరీ టికెట్‌కు కోటి రూపాయలు గెలుచుకున్నాడు.
దీంతో ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తనకు సెక్యూరిటీ కావాలని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతడిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లి.. తన ఇంటి వద్ద పోలీసులను కాపలా పెట్టారు.
తెల్లారి వెంటనే లాటరీ టికెట్ ఇచ్చి కోటీ రూపాయలు తెచ్చుకున్నాడు. అయితే.. షేక్ తల్లికి ఆరోగ్యం బాగాలేదు. తన ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. తన ట్రీట్మెంట్ కోసం ఎలాగైనా డబ్బులు సేకరించాలని.. షేక్ అక్కడా ఇక్కడా తిరుగుతున్న నేపథ్యంలోనే అతడు లాటరీ టికెట్ గెలవడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఇంత డబ్బుతో ఏం చేస్తావు.. అని అడిగితే.. తన తల్లికి ట్రీట్మెంట్ చేయించి.. మిగిలిన డబ్బుతో ఉండటానికి సొంత ఇల్లు కట్టుకుంటా.. అంతే అంటూ చెప్పుకొచ్చాడు షేక్. మొత్తానికి అంబులెన్స్ డ్రైవర్ కాస్త కోటీశ్వరుడు కావడంతో అక్కడి స్థానికులు అతడిని ఆశ్చర్యంగా చూడటం మొదలు పెట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్‌ను మింగిన ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
70 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన ‘పోహా’ అమ్ముతూ జీవనం.. ఈ వృద్ధ జంట కష్టాలు తెలిస్తే కన్నీళ్లాగవు
Train | పెరుగు కోసం రైలు ఆపేసిన డ్రైవర్.. వీడియో వైరలవడంతో..
కూతుళ్లకు టీ ఎలా చేయాలో నేర్పించిన యూఎస్ ఫేమస్ డాక్టర్ సంజయ్ గుప్తా: వీడియో వైరల్