3 ఏళ్ల బాలుడు అడవిలో తప్పిపోయాడు. మూడు రోజులు అయినా అ చిన్నారి జాడ కనిపించలేదు. దీంతో ఆ చిన్నారికి ఏమైందో అని అందరూ అనుకున్నారు. తల్లిదండ్రులకు కూడా ఆశలు వదిలేసుకోవాలని చెప్పారు పోలీసులు. కానీ.. అందరినీ షాక్కు గురి చేస్తూ.. అడవిలో ఒక్కటే ఒంటరిగా మూడు రోజులు ఉండి.. ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
ఆంటోనీ అనే బాలుడు.. సిడ్నీ నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న తన ఫ్యామిలీ కాటేజ్ నుంచి మిస్ అయ్యాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన రెస్క్యూ టీమ్.. అక్కడికి దగ్గర్లో ఉన్న అడవిలో గాలించడం స్టార్ట్ చేసింది. ఆ బాలుడికి ఆటిజం అనే సమస్య కూడా ఉండటంతో.. ఆ బాలుడిని త్వరగా పట్టుకోవాలన్న ఉద్దేశంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగినప్పటికీ.. ఆ బాలుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. మూడు రోజుల పాటు.. అడవి అంతా గాలించారు. అయినా కనిపించలేదు. దీంతో అందరూ ఆ బాలుడి మీద ఆశలు వదిలేశారు. కానీ.. చివరి అస్త్రంగా హెలికాప్టర్లో రెస్క్యూ టీమ్ సెర్చ్ చేస్తుండగా.. ఓ నీళ్ల గుంటలోకి దిగి.. ఆ నీళ్లతో ఆడుకుంటున్న బాలుడిని టీమ్ గుర్తించింది. ఆ బాలుడిని చూసి పోలీసులే షాక్ అయ్యారు.
మూడు రోజులు, మూడు రాత్రులు ఒంటరిగా అడవిలో ఉండి.. బతికి బయటపడటం అనే మిరాకిల్ అంటూ అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ బాలుడి శరీరం మీద చిన్న చిన్న గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాలుడిని హెలికాప్టర్ నుంచి బైనాక్యులర్ ద్వారా గుర్తించిన వీడియోను రెస్క్యూ టీమ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇలాగే.. 72 ఏళ్ల ఓ వృద్ధుడు కూడా అడవిలో వర్షపు నీళ్లను తాగుతూ 3 రోజులు అడవిలోనే ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు.
MUST WATCH: This is the moment three-year-old Anthony "AJ" Elfalak is spotted from the sky following a four-day search in rural NSW.
— 9News Sydney (@9NewsSyd) September 6, 2021
AJ has since been taken to hospital with his mother, Kelly.
DETAILS: https://t.co/1hb1M05ZcE
See the full story, 6pm on #9News pic.twitter.com/YQffxLceBk
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Bald Fest : అక్కడికి బట్టతల ఉంటేనే ఎంట్రీ.. బట్టతల ఫెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే?
Costly Cottage : ఏమీ లేని ఈ కాటేజ్కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
Barbie doll : బార్బీ డాల్లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?