Bald Fest : అక్కడికి బట్టతల ఉంటేనే ఎంట్రీ.. బట్టతల ఫెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే?
అక్కడికి బట్టతల ఉంటేనే ఎంట్రీ | అందులోనూ పెళ్లికాని యువకులు అయితే జుట్టు రాలితే చాలు.. బట్టతల వస్తుందని టెన్షన్ పడతారు.
రెండు మూడు వెంట్రుకలు ఊడితే చాలు.. వామ్మో.. బట్టతల వచ్చేస్తుందా.. అని తెగ బాధపడిపోతారు కొందరు. ముఖ్యంగా మగవాళ్లు.. అందులోనూ పెళ్లికాని యువకులు అయితే జుట్టు రాలితే చాలు.. బట్టతల వస్తుందని టెన్షన్ పడతారు. ఆడవాళ్లలోనూ ఈ టెన్షన్ ఎక్కువే ఉంటుంది. నిజానికి.. బట్టతల అనేది వ్యాధి ఏం కాదు.. కొన్ని పరిస్థితుల వల్ల.. ప్రొటీన్స్ లోపం వల్ల జుట్టు ఊడుతుంది.

అయితే.. బట్టతల ఉంటే ఎవరూ పెళ్లి చేసుకోరని.. చాలా మంది అపోహ పడి.. బట్టతల అంటే భయపడిపోతారు. బట్టతల ఉండటం శాపం కాదు.. అదృష్టం అని చెప్పి.. బట్టతల ఉన్నవాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకే.. న్యూయార్క్‌లో బట్టతల పండుగను నిర్వహిస్తున్నారు.
ఈ పండుగను ప్రారంభించింది ఎవరు?
ఈ పండుగను.. యూఎస్ రాపర్ రమి ఈవెన్ ఎష్ ప్రారంభించారు. బట్ట తల ఉన్నవాళ్లు కానీ.. జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవాళ్లు కానీ ఈ ఫెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఈ ఈవెంట్ బ్రూక్లిన్‌లోని రుబులాడ్ క్లబ్లో జరుగుతుంది. కాకపోతే.. 18 డాలర్లు పే చేసి టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. కానీ.. ఈవెంట్‌కు వెళ్లాలనుకునేవాళ్లకు ఖచ్చితంగా బట్టతల ఉండాలి. లేకపోతే.. లోపలికి పంపించరు.

అలాగే ఫ్యాషన్ వీక్ ఫెస్ట్‌కు పోటీగా ఈ బట్టతల ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో బట్టతల ఉన్నవాళ్లను మోటివేట్ చేయడంతో పాటు.. బట్టతలనే ఎలా స్టయిల్‌గా చేసుకోవాలో చెబుతారు. అలాగే.. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది.
యూఎస్‌లో జుట్టురాలే సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు యూఎస్ మొత్తం మీద 5 కోట్ల మంది పురుషులు, 3 కోట్ల మంది మహిళలకు జుట్టు రాలే సమస్యతో పాటు బట్టతల ఉన్నట్టు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Bird Photographer of the Year 2021 : పక్షుల ఫోటోగ్రఫీ.. అవార్డ్స్ గెలుచుకున్న ఈ ఫోటోలను చూసి ఫిదా కావాల్సిందే..!
Costly Cottage : ఏమీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
Barbie doll : బార్బీ డాల్‌లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

