KCR Birthday Specail | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
CM KCR Birthday Special | ఆధునికుల దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే? వారాంతాల్లో, సెలవు దినాల్లో విలాసంగా, విశ్రాంతిగా గడపడం కోసం ఎకరమో, రెండెకరాల్లోనో కట్టుకున్న ప్రత్యేకమైన ఇల్లు. కానీ పల్లె జీవితానికే అలవాటుపడ్డ ఒక రైతు దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే? తను వ్యవసాయం చేసుకోవడానికి నిరంతరం అందుబాటులో ఉండేలా పొలం మధ్యలోనే కట్టుకున్న పొదరిల్లు. కేసీఆర్ అలాంటి రైతే. ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు, ఆయన తనకిష్టమైన వ్యవసాయాన్నీ చేస్తుంటారు… ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో! సాగు విధానాలపై అనేక ప్రయోగాలూ చేస్తూ పర్యవేక్షిస్తారు. కేసీఆర్ వ్యవసాయ నిపుణులను ఎర్రవల్లి ఇంటికి రప్పించుకుని, సాగు విధానాలపై చర్చిస్తూ ఉంటారు. కొత్త ప్రయోగాలు చేసిన రైతులను అక్కడ కలుసుకుంటారు. తను ముఖ్యులని భావించే అతిథులకు, ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్లో కాకుండా, తన సొంత ఇైల్లెన ఎర్రవెల్లిలో ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు. అక్కడైతే ఆత్మీయత ఉంటుందనేది ఆయన భావన. ఆ పంట పొలాలు, మడికట్లు, గట్లు, పచ్చని చెట్లు… 68 ఏండ్ల వయసున్న కేసీఆర్‌ను అధికార బాధ్యతల ఒత్తిడి నుంచి బయటపడేసి రీచార్జ్ చేస్తాయి. రైతులకు సంబంధించి వాటితో పాటు, అనేక పథకాలు, వాటి పేర్లు పురుడు పోసుకున్నది ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే!
తెలంగాణ మెయిన్ ట్యాగ్‌లైన్ నిధులు, నియామకాలు, నీళ్లు. కావలసింది నీళ్ల సమస్యకు పరిష్కారం. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా కోటి ఎకరాలకు నీరందించి తీరుతాం. మా యువతకు ఉద్యోగాలు ఇచ్చుకుంటాం.. మా నిధులు మేమే వాడుకుంటాం.. సద్వినియోగం చేసుకుంటాం.. ఆ దిశగా మా ప్రస్థానం కొనసాగుతుంది. ఆపాలని అనుకుంటే అది వాళ్ల భ్రమ.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
CM KCR | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
KCR | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు
CM KCR | కలిసిపోయి ఆత్మీయంగా మాట్లాడుతారు.. కరిగిపోయి అవసరమైన సాయం చేస్తారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

