Arnab Cyclone | అర్నబ్ తుపాను బీభత్సం.. కోస్తా తీరం అతలాకుతలం..!
Arnab Cyclone | ఈ ఉదయం తీరం దాటిన అర్నబ్ తుపాను బీభత్సం సృష్టిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోస్తా తీరాన్ని అతలాకుతలం చేస్తున్నది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రచండ గాలులతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
Arnab Cyclone : ఈ ఉదయం తీరం దాటిన అర్నబ్ తుపాను బీభత్సం సృష్టిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోస్తా తీరాన్ని అతలాకుతలం చేస్తున్నది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రచండ గాలులతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపుతున్నది.
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా గరివిడిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అనకాపల్లి, శృంగవరపుకోట, వేపాడ, చీపురుపల్లిలో 25 సెంటీమీటర్లు, భీమునిపట్నం, ఎలమంచిలి, మెంటాడలో 24 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. విశాఖపట్నం, విజయనగరం పట్టణంలో 21-22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో సువర్ణముఖి, గోస్తనీ, చంపావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాలు నీట మునిగాయి. సాలూరు బస్టాండ్ పూర్తిగా నీటిలో చిక్కుకుంది. బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
నర్సాపురం వద్ద తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు వీయడంతో అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆచంట, పెనుగొండ మండలాల్లో పలు ఇళ్లపై చెట్లు కూలాయి. దాంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోనసీమ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లోనూ పలు రహదారులు జలమయమయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నీట మునగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. భూపతిపాలెం, వట్టిగెడ్డ వంటి జలాశయాలు నిండుకుండలా మారాయి.
కృష్ణా, గుంటూరు జిల్లాలను సైతం భారీ వర్షాలు ముంచెత్తాయి. గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల-కొరిటపాడు రహదారి మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బీఆర్ స్టేడియం చెరువును తలపిస్తున్నది. ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం, పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ నీటిలో చిక్కుకున్నాయి. బాపట్లలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేమూరు నియోజకవర్గంలో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి.
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంతో సహా పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాగాయలంక వద్ద కృష్ణా నదిలో అలల ఉద్ధృతి పెరిగింది. తుపాను పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితి చక్కబడే వరకు సహాయక చర్యలను కొనసాగించాలని స్పష్టంచేశారు.
విరిగిన చెట్లను తొలగించడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులను అధికారులు ముమ్మరం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arnab Cyclone | అర్నబ్ తుపాను బీభత్సం.. కోస్తా తీరం అతలాకుతలం..!
Harsh Gujral: జోకేసిన హర్ష్ గుజ్రాల్.. నవ్వుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
Patlolla Karthik Reddy | పబ్లిక్ లేకుండా మూసీ పబ్లిక్ హియరింగ్ ఏందో..? రేవంత్ సర్కార్‌పై పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్
AH Movie | నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న రాహుల్ విజయ్ ‘అ’!
ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు : బాల్క సుమన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

