AH Movie | నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న రాహుల్ విజయ్ ‘అ’!
AH Movie | రాహుల్ విజయ్ మరియు అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్ 'అ' (AH) సినిమా విడుదల తేదీలో మార్పు చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
AH Movie | రాహుల్ విజయ్ మరియు అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్ ‘అ’ (AH) సినిమా విడుదల తేదీలో మార్పు చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న థియేటర్లలోకి తీసుకురావాలని భావించినప్పటికీ, ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యుత్తమ అవుట్‌పుట్ అందించాలనే ఉద్దేశంతో సినిమా విడుదలను నవంబరు 12కి మార్చారు. ఈ మేరకు విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పటికే అడివి శేష్ విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇటీవలే విడుదలైన ‘ఇదేనా ఇదేనా’ లిరికల్ వీడియో సాంగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది.
స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి బాలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఒక ఉత్తమమైన సినిమాను అందించానని తెలిపారు. టైటిల్ చుట్టూ ఉన్న అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం, అసాంఘీకం, అమానుషం అనే పదాల చుట్టూనే ఈ కథ తిరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో రాహుల్ విజయ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని, ఇన్వెస్టిగేషన్ డ్రామాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. రాహుల్ విజయ్ కెరీర్లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందని, సరైన ప్లానింగ్‌తో నవంబరు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.
ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిస్టరీ, ఎమోషన్, ఉత్కంఠభరితమైన మలుపులతో కూడిన డార్క్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ లతో పాటు జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న రాహుల్ విజయ్ ‘అ’!
ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు : బాల్క సుమన్
Health tips | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌లో ఆ పార్టును అస్సలు తినొద్దు తెలుసా..?
Hardeep Singh Puri: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు హర్దీప్ సింగ్ పురి
Harivarasanam | శబరిమల నేపథ్యంలో డివోషనల్ థ్రిల్లర్.. ‘హరివరాసనం’ ఫస్ట్ లుక్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

