ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు : బాల్క సుమన్
రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించేందుకు తమ్మడిహెట్టి ప్రాజెక్టును తెర మీదికి తీసుకువచ్చి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు.
అదిలాబాద్ : రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించేందుకు తమ్మడిహెట్టి ప్రాజెక్టును తెర మీదికి తీసుకువచ్చి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆదిలాబాద్‌లో నవంబర్ 1న నిర్వహించే రైతు గర్జన పోస్టర్లను మాజీ మంత్రి జోగు రామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు ఏర్పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయాక గోదావరి, కృష్ణ నీటిని ప్రభుత్వం కిందికి వదిలిందని పేర్కొన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం నమోదైన అక్కడ కరువు పరిస్థితులు లేవన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రానికి నీటిని అందించడంలో సహాయపడినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత కారణంగా కృష్ణాజలాలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడడానికి కాంగ్రెస్ కారణమైతే బీజేపీ సైతం సహకరిస్తుందని చెప్పారు. రైతు గర్జనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు : బాల్క సుమన్
Health tips | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌లో ఆ పార్టును అస్సలు తినొద్దు తెలుసా..?
Hardeep Singh Puri: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు హర్దీప్ సింగ్ పురి
Harivarasanam | శబరిమల నేపథ్యంలో డివోషనల్ థ్రిల్లర్.. ‘హరివరాసనం’ ఫస్ట్ లుక్ విడుదల!
Puvvada Ajay | ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

