Patlolla Karthik Reddy | పబ్లిక్ లేకుండా మూసీ పబ్లిక్ హియరింగ్ ఏందో..? రేవంత్ సర్కార్‌పై పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్
Patlolla Karthik Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హియరింగ్స్ పెట్టుకొని బాధితులు లేకుండా పబ్లిక్ హియరింగ్ పెట్టడమేందో ఈ రాజేంద్ర నగర్ సాక్షిగా మూసీ బాధితులను ప్రత్యక్షంగా చూస్తున్నమన్నారు బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి.
Patlolla Karthik Reddy | మూసీ పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు ఈడ్చుకెళ్లారు.ఈ క్రమంలో మా తరపున మాట్లాడేందుకు వస్తే పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసు వాహనం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పబ్లిక్ హియరింగ్‌లో పబ్లిక్ లేకుండా ఈ హియరింగ్ ఏందో నాకైతే అర్థం కావడం లేదని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా విచిత్రాలు జరిగినయి… దాంట్లో ఒక విచిత్రం.. పబ్లిక్ హియరింగ్స్ పెట్టుకొని బాధితులు లేకుండా పబ్లిక్ హియరింగ్ పెట్టడమేందో ఈ రాజేంద్ర నగర్ సాక్షిగా మూసీ బాధితులను ప్రత్యక్షంగా చూస్తున్నమన్నారు.
రాజేంద్రనగర్‌లో మూసీకి సంబంధించిన బాధితులు ముఖ్యమంత్రి మూసీ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పటి నుంచి ఎన్నో రోజుల నుంచి మా ఇండ్లు ఏమైతయి.. మా భూములు ఏమైతయి.. మా పరిస్థితేంటని ఆగమైతున్నరు.. ప్రభుత్వం పెద్దన్న తీరుగా ఉండి కనీసం వాళ్లను ఆదుకోవాలనే పరిస్థితిలో ఉండాలి కానీ.. బలవంతంగా వాళ్లెవరైనా మాట్లాడితే.. వాళ్లను తీసుకెళ్లడం అరెస్ట్ చేయడం,, వాళ్ల తరపున మేమొస్తే కూడా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం ఇదెక్కడ పోతుందో.. ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు.
ఓ దిక్కేమో ముఖ్యమంత్రి కరువున్నది.. నీళ్లకు ఇబ్బంది ఉన్నది.. పైసలకు ఇబ్బంది ఉన్నది.. ఒక సంవత్సరం వరకు ఏం చేయలేము.. దయచేసి మీ అందరినీ వేడుకుంటున్న.. మీరంతా ఇంట్లో పడుకోండని చెప్తున్న ముఖ్యమంత్రికి లక్షా కోట్ల పెట్టి మూసీ ప్రాజెక్టు చేయడానికి పైసలెక్కడి నుంచి వస్తున్నయి.. ద్వంద్వ వైఖరిని ఎందుకు అనుసరిస్తున్నారు.. ఖచ్చితంగా మేం పోరాటం చేస్తాం.. మూసీ బాధితులకు అండగా నిలబడతాం.. వారి కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు.
పబ్లిక్ లేకుండా పబ్లిక్ హియరింగ్ పెట్టుకోవడం ఏంటి?
రేవంత్ రెడ్డి వచ్చాక చాలా విచిత్రాలు జరిగాయి.. అందులో ఇదొక విచిత్రం
మూసీ బాధితులను అరెస్ట్ చేసి, వాళ్లు లేకుండానే పబ్లిక్ హియరింగ్ పెట్టారు
ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి బాధితులను, వారి తరపున వెళ్లిన మమ్మల్ని అరెస్టులు చేయిస్తున్నారు
ఒక పక్క కరువు ఉంది, డబ్బులు లేవు, రైతులు పంటలు వేయకండి అని రేవంత్ రెడ్డి అన్నాడు
మరోవైపు లక్ష కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్టు కట్టడానికి రేవంత్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి?
– బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2026
మూసీ పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని ఈడ్చుకెళ్లిన పోలీసులు
మా తరపున మాట్లాడేందుకు వస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసు వాహనం ముందు బాధితుల ఆందోళన https://t.co/iB2D4OM7RC
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla Karthik Reddy | పబ్లిక్ లేకుండా మూసీ పబ్లిక్ హియరింగ్ ఏందో..? రేవంత్ సర్కార్‌పై పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్
AH Movie | నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న రాహుల్ విజయ్ ‘అ’!
ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు : బాల్క సుమన్
Health tips | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌లో ఆ పార్టును అస్సలు తినొద్దు తెలుసా..?
Hardeep Singh Puri: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు హర్దీప్ సింగ్ పురి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

