కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం : ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్య, ఆరోగ్యం పూర్తిగా నిర్వీర్యమైంది అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
కోరుట్ల అక్టోబర్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్య, ఆరోగ్యం పూర్తిగా నిర్వీర్యమైంది అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్న చందంగా ప్రభుత్వ దవాఖానలు మారిపోయాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అధునాతన దవాఖానలను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా హాస్పిటల్‌ను బుధవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు దవాఖానలోని ప్రధాన విభాగాలైన డయాలసిస్ సెంటర్, ఇన్ పేషంట్, ప్రసూతి విభాగం, ఆపరేషన్ థియేటర్, చిన్నపిల్లల వార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖాన వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దవాఖానకు వచ్చే రోగులతో స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు. సిబ్బంది తక్కువగా ఉన్నారని, సాకులు చెప్పవద్దని, అంకిత భావంతో పని చేయాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో వైద్య ఆరోగ్య రంగం అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. కోరుట్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రూ. 14 కోట్ల వ్యయంతో వంద పడకల దవాఖానగా ఆధునికరించడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు ప్రాథమిక హాస్పిటల్ కన్నా దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధునాతన హాస్పిటల్ల భవనంలో కోట్లాది రూపాయలు వైద్య పరికరాలు తుప్పు పట్టి పోతున్నాయన్నారు. దవాఖానలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్పిటల్‌కు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు దారీశెట్టి రాజేష్, పహీం, మహేష్, నరేష్, సురేందర్, వసీం, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం : ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
Arnab Cyclone | అర్నబ్ తుపాను బీభత్సం.. కోస్తా తీరం అతలాకుతలం..!
Harsh Gujral: జోకేసిన హర్ష్ గుజ్రాల్.. నవ్వుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
Patlolla Karthik Reddy | పబ్లిక్ లేకుండా మూసీ పబ్లిక్ హియరింగ్ ఏందో..? రేవంత్ సర్కార్‌పై పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్
AH Movie | నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న రాహుల్ విజయ్ ‘అ’!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

