భోపాల్ : ఇంట్లో డబ్బులు లేకపోతే ఆ ఇంటికి తాళం ఎందుకు వేశావు? అని దొంగలు కలెక్టర్‌ను ప్రశ్నిస్తూ ఓ లేఖను వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు సమీపంలో చోటు చేసుకుంది.
భోపాల్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని సివిల్ లైన్స్‌లోని త్రిలోచన్ గౌర్ బంగ్లాలో ఓ కలెక్టర్ నివాసం ఉంటున్నాడు. అయితే ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న రూ. 30 వేలు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. ఇక ఇంట్లో డబ్బులు లేనప్పుడు తాళం ఎందుకు వేయడం.. కలెక్టర్ అని ఓ చిటీపై రాసి దొంగలు వెళ్లిపోయారు.
పదిహేను రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన కలెక్టర్ ఆ లేఖను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రూ. 30 వేలు, బంగారు ఆభరణాలు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
In a strange incident of theft in Dewas, burglars not only broke into the house of a deputy collector but also left a note for him. "Jab paise nahi they toh lock nahi karna tha na collector! pic.twitter.com/mafaLj4gPC
— Anurag Dwary (@Anurag_Dwary) October 10, 2021