పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్

- ఇంగ్లిష్ మీడియం వారికి నిఘంటువు
- ఆవిష్కరించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో స్టడీ మెటీరియల్‌ను రూపొందించినట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం గన్‌ఫౌండ్రీలోని తన కార్యాలయంలో స్టడీ మెటీరియల్‌ను మంత్రి ఆవిష్కరించారు. డిజిటల్ తరగతుల ద్వారా అభ్యసించిన పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థంచేసుకునేలా స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుందని చెప్పారు. తెలుగు, ఉర్దు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో రూపొందించిన మెటీరియల్.. కార్పొరేట్ విద్యాసంస్థల నోట్సుకన్నా అద్భుతం గా ఉన్నదని ప్రశంసించారు. www.scert.telangana.gov.in లో మెటీరియల్‌ను అందుబాటులో ఉంచామన్నారు. ఆంగ్లమాధ్య మ విద్యార్థులు మాతృభాషలో సాంకేతిక పదాలు నేర్చుకోవడానికి బహుభాషా నిఘంటువును రూపొందించినట్టు మంత్రి తెలిపారు. గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘికశాస్ర్తాల్లో సాంకేతిక పదాలతో పలు భాషల్లో నిఘంటువును రూపొందించామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్, విద్యాశాఖ కమిషన్ శ్రీదేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యం
నేటినుంచి టీచర్లకు ఒంటిపూట బడులు
జానారెడ్డి గెలిచి ఏం చేస్తారు?
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

