CM KCR Press Meet | బీజేపీ ( BJP ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi sanjay ) తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరి పంటనే పండించాలని.. మెడలు వంచి మేం కొనిపిస్తం అంటున్నాడని.. ఎవరి మెడలు వంచుతరి ప్రశ్నించారు. ఆయన మెడలు వంచుకుంటడా? కేంద్రం మెడలు వంచుతడా? అంటూ ధ్వజమెత్తారు. దుసురుగా ఏ పరిస్థితిలో మాట్లాడుతారని ?.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఆర్డర్ ఇస్తుందా? అని డిమాండ్ చేశారు. ఢిల్లీ బీజేపీ ధాన్యం కొనమని అఫీషియల్‌గా లెటర్లు ఇస్తుందని.. బాయిల్ రైస్ అయితే కిలో కూడా తీసుకోమని చెప్పి కండిషన్లు పెడుతుందని డబ్బులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సతాయిస్తుందని ఆరోపించారు..
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా పూర్తిగా అబద్ధాలు, తప్పులను.. నిర్లక్ష్య వైఖరితో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ఏది పడితే అది మాట్లాడవచ్చు.. మాట్లాడగలుగుతాం అనే ధీమాతో మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు నెత్తి లేదు.. నా కత్తి లేదని విమర్శించారు. ఆయనకు బాధ్యత లేదని.. ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడని.. అయినా క్షమిస్తూ వచ్చానన్నారు. నా స్థాయి మనిషి కాదని పట్టించుకోలేదని, తనపై వ్యక్తిగతంగా అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు చేసినా కుక్కలు మొరుగతయ్లే వదిలి పెట్టానన్నారు. ఏడేళ్లు తెలంగాణ రైతులను కంటికి నిద్ర లేకుండా కాపాడి, ఒక స్థాయికి తీసుకువచ్చామని.. అప్పులు కట్టిపించి.. వారినో గడ్డకేసి బాగుపడేలా చూస్తే.. మొత్తం రైతాంగం బతుకునే ఆగం చేసే విధంగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. సంజయ్‌కి కావాల్సింది రైతులు ధాన్యం పండించడం.. ఢిల్లీలో ధాన్యం తీసుకోరు.. రైతులు ఇక్కడ రోడ్లపై ధర్నాలు చేయాలి.. రాజకీయ పబ్బం గడవడం కావాలన్నారు. ఇవాళ తాను మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చిందని, నిన్న సంజయ్ గందరగోళం సృష్టించారని.. ఈ క్రమంలో రైతులు ఆయన చెప్పే సొల్లు కబర్లు, పనికిమాలిన మాటలు విని నమ్మి వరి సాగు చేస్తే దెబ్బతింటామన్నారు.
తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట క్షేమదాయకం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. ధాన్యం తీసుకునే కేంద్రం చేతులు ఎత్తివేస్తున్నదని.. తీసుకోమని నిరాకరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం మొదటి నుంచి రైతులకు వ్యతిరేకంగా వెళ్తోందని, రైతుల ప్రయోజనాలను కార్పోరేటర్లకు అప్పగిస్తోందని ఆరోపించారు. సంవత్సర కాలం నుంచి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని, రైతులు ఉద్యమాలు చేస్తుంటే వారిపై కార్లు ఎక్కించి చెప్పుతున్నారన్నారు. రైతులను కొట్టమని రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు చెబుతున్నారన్నారు. కేంద్రమంత్రులు కార్లు ఎక్కి చంపితే.. సీఎంలు దాడి చేయమని చెబుతారన్నారు.. వీరంతా రైతులను అణచివేసే ధోరణిలో ఉన్నారనే వైఖరి స్పష్టమవుతుందన్నారు.
రేపు మనకు ఇదే పరిస్థితి సంభవిస్తుందని.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతతో స్పష్టంగా రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారన్నారు. ఏడేళ్లు చాలా సహనంతో ఉన్నామని, అడ్డదిడ్డంగా, అహంకారపూరితంగా, దురుసుగా మాట్లాడినా.. స్థాయికి మించి మాట్లాడి క్షమించి.. వదిలేశామన్నారు. కానీ, మా చిల్లర రాజకీయాల కోసం రైతాంగం జీవితంతోనే ఆడుకుంటామని, రైతులు ఏమైనా పర్లదేని, మేం మాత్రం సొల్లు పురాణం మాట్లాడుతూనే ఉంటామంటున్నారని.. ఈ క్రమంలో తాను ఈ విషయంపై స్పందించినట్లు చెప్పారు. బీజేపీ నుంచి రైతాంగాన్ని హెచ్చరించి, కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే.. ఈ విషయాలను చెబుతున్నానన్నారు.
బీజేపీ నేతలు చెప్పేవి తప్పేనన్నారు. రైతులకు ఏడేళ్లుగా ఎవరు కాపాడిందో తెలుసునని? కరెంటు, ఎరువుల సరఫరా, ధాన్యం ఎలా కొనుగోలు చేస్తున్నది తెలుసునన్నారు. రైతాంగం నష్టపోకుండా, ఇబ్బందులు లేకుండా.. కేంద్రం కొనని ధాన్యాన్ని పండించి.. దెబ్బతినకుండా.. మళ్లీ తెలంగాణ రైతులకు గత దుస్థితి రాకుండా ఉండేందుకు వ్యవసాయ మంత్రి ప్రకటన చేశారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదని, వర్షాకాలం పంటనే కొనుగోలు చేస్తారా? లేదా? అని తెలియదని.. అయినా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.
కేంద్రంతో ఎలాగైనా కొట్లాడేందుకు.. రైతులు నష్టపోకుండా వర్షాకాలంలో పండిన పంటను ధైర్యం చేసి కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ధర్నాలు చేసే వారేనని.. ఢిల్లీలో ధాన్యం కొనందని వారేనన్నారు. మళ్లీ ఇప్పుడు యాసంగిలో వరి సాగు చేయాలని బాధ్యతా రాహిత్యంగా చెప్పేది వీళ్లేనన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ ఇదే మోసమని, ప్రతి మాటలో ఇదే అహంకారంతో కూడుకున్నవని విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR : పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా నిరూపించిన సీఎం కేసీఆర్
CM KCR Press meet | కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్..
CM KCR : ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట.. ఎవరిని నమ్మాలి : సీఎం కేసీఆర్
కేంద్రం వరి సాగు లేదని అవమానించింది : సీఎం కేసీఆర్
CM KCR : బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పిన ఆర్బీఐ : కేసీఆర్
Bandi sanjay | బండి సంజయ్ నన్ను జైలుకు పంపుతవా..? అంత బలుపా? : సీఎం కేసీఆర్