హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ, కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో ఆమె ఇడుపులపాయ వెళ్లారు. కుమారుడి పెండ్లి పత్రికను ఘాట్ వద్ద ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని, తమ త్యాగాలకు విలువ ఇచ్చిన పార్టీలో చేరాలని కోరిందని, అందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దేశంలో అందరికీ భద్రతనిచ్చే అది పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలిపారు. ఈ నెల 4న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.