Kodandaram | కాంగ్రెస్ ప్రభుత్వంపై యువత ఆగ్రహం!..నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కష్టం
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తె లంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఆయన ఓ యూ ట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై స్పందించారు.
- నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కష్టం
- రాష్ట్ర ప్రభుత్వానికి నాకు మధ్య గ్యాప్ నిజమే
- కేసీఆర్ కృషితోనే జేఏసీ ఏర్పాటు
- తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తె లంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఆయన ఓ యూ ట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై స్పందించారు. ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని అ సెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన మాట వాస్తవమని అన్నా రు. నాడు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించిందని గుర్తుచేశారు. అ యితే వర్గీకరణ అంశంతోనే జాబ్ క్యాలెండర్ గాడి తప్పిందని పేర్కొన్నారు. కొత్తగా 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇటీవ ల ప్రభుత్వం చెప్పిందని, అయితే యువతలో అంసతృప్తి తీవ్ర స్థాయికి చేరడంవల్లే ఈ నియామకాల అంశాన్ని తెరమీదికి తెచ్చిందని వెల్లడించారు.
అందరికీ ఉద్యోగాలివ్వడం అసాధ్యమని, నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదని కోదండరాం తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించి వాటినే ప్రణాళికాబద్ధంగా భర్తీ చేయాలని డి మాండ్ చేశారు. ‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. రాబోయే మూడేండ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం’ అని ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు కదా? అని యాంకర్ ప్ర శ్నించగా.. కోదండరాం బదులిస్తూ మహే శ్ కుమార్ గౌడ్ ఏమన్నారని కాదని ఏటా ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక అవస రం ఉందని దాటవేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం యువత ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ ఆకాంక్షల సాధనకు రాష్ట్ర ప్రభుత్వానికి పకడ్బందీ వ్యూహం అవసరం అని సూ చించారు. తెలంగాణ స్వప్నాన్ని ఇంకా సాకారం చేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో అపసవ్యంగా వ్యవస్థ
రాష్ట్రం, దేశ రాజకీయాల్లో సరళీకరణ ప్రభావంతో అన్నింటినీ ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నంలో.. వ్యవస్థ అపసవ్యం గా సాగుతున్నదని కోదండరాం ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలను ప్రమోట్ చేయడం రాజకీయాల్లో ప్రధానంగా ముందుకు వస్తున్నదని అభిప్రాయపడ్డారు. ప్రజల కేంద్రంగా సోషలిస్టు దృష్టి కోణం రావాల్సి ఉన్నదని చె ప్పారు. ‘తెలంగాణ జన సమితి’ రాజకీయాల్లో వెనకబడింది నిజమే అని ఆయన ఒప్పుకున్నారు. పార్టీ పెట్టి ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం సబబు అనిపిస్తుందా.. అని ప్రశ్నించగా.. తన అస్తిత్వాన్ని గుర్తించి కాంగ్రెస్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిందని సమర్థించుకున్నారు. అందులో ఇబ్బంది ఏముంది? అంటూ ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని తెలంగాణ జన సమితి పార్టీ నాయకుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని అంగీకరించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత తమ అసంతృప్తిని ప్రభుత్వానికి చెప్పాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రభుత్వంతో గ్యాప్ ఉన్న మా ట వాస్తవమే అని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌లో నేతల మధ్య ఈ సమస్య ఉంది కదా? అంటూ సమర్థించుకున్నారు.
నాడు కేసీఆర్ చొరవతోనే జేఏసీ
2009 నవంబర్ 28న కేసీఆర్ దీక్ష చేస్తే ఓయూ విద్యార్థులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారని కోదండరాం గుర్తుచేశారు. కేసీఆర్ దీక్ష కొనసాగుతుండగానే డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని వివరించారు. ఏపీలో అంతా కలిసి పోరాడి తెలంగాణ ప్రకటనను అడ్డుకున్నారని గ్రహించిన కేసీఆర్.. ఉమ్మడి వేదిక ఉంటేనే తెలంగాణ సాధించవచ్చని జేఏసీ ఏర్పాటుకు పూనుకున్నట్టు తెలిపారు. నాడు జానారెడ్డిని కలిసి జేఏసీ ఏర్పాటు నిర్ణయాన్ని తెలపగా.. కేసీఆర్ ప్రతిపాదనకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు అంగీకరించాయని వెల్లడించారు. కేసీఆర్ చొరవతోనే నాడు కళింగభవన్‌లో జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

