గార్ల, ఆగస్టు 12 : అంబులెన్స్ రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిన యువతిని బైక్‌పై తరలించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్రెడ్డిగూడెంలో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్రెడ్డిగూడేనికి చెందిన గుగులోత్ హారిక హైదరాబాద్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది.
3 రోజుల క్రితం గ్రామానికి వచ్చింది. సోమవారం బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసినా, సకాలంలో రాక యువతి బాబాయి, మరో యువకుడు కలిసి బైక్‌పై ఖమ్మం బయల్దేరారు. అంబులెన్స్రాగా, ఖమ్మం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నది.