గద్వాల: జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మానవపాడు మండలం ఏ.బూడిదపాడుకు చెందిన మహేశ్ (23) తన స్నేహితుడితో కలిసి జూరాల ప్రాజెక్టు చూసేందుకు బైక్పై వెళ్లాడు. ప్రాజెక్టు చూసిన తర్వత తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలో వారి బైకును వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొంది.
దీంతో మహేశ్ బైక్పై నుంచి ఎగిరి ప్రాజెక్టు గేట్ల ముందు పడిపోయాడు. వరద అధికంగా ఉండటంతో అందులో కొట్టుకుపోయి మృతి చెందాడు. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కర్నూలు దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.