Crop Bonus | ధాన్యం బోనస్ పైసా ఇయ్యలే.. నేటికీ నిధులు కేటాయించని రేవంత్ సర్కార్
Crop Bonus | రైతుల నుంచి ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు కావొస్తున్నది. అయితే, ఇప్పటివరకు సన్నధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ నయా పైసా ఇవ్వలేదు.
Crop Bonus | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రైతుల నుంచి ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు కావొస్తున్నది. అయితే, ఇప్పటివరకు సన్నధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ నయా పైసా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తుందో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. బోనస్ కింద రైతులకు రూ.700 కోట్లకుపైగా చెల్లించా ల్సి ఉన్నది. రైతులు బోనస్ పైసల కోసం ఎదురుచూస్తున్నారు.
వానకాలం సాగు మొదలవుతున్నా యాసంగిలో బకాయి ఉన్న మూడో విడత రైతుభరోసాతోపాటు యాసంగి ధాన్యం బోనస్ పైసల విషయంలో ప్రభుత్వం స్పం దించడంలేదు. బోనస్ విడుదలకు సంబంధించి ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని తెలిసింది. దీంతో ఈ యాసంగిలోనూ సన్నధాన్యం బోనస్ వస్తుందా? లేదా? అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ యాసంగిలో ప్రభుత్వం ఇప్పటివరకు 73 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 59 లక్షల టన్నులు దొడ్డు ధాన్యం కాగా, 14 లక్షల టన్నుల సన్నధాన్యం ఉన్నది. టన్నుకు రూ.5వేల చొప్పున బోనస్ కింద రైతులకు రూ.700 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉన్నది. కానీ, ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా నయా పైసా చెల్లించలేదు.
ధాన్యానికి సంబంధించిన మద్దతు ధర పైసలను సివిల్‌సైప్లె కార్పొరేషన్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రైతులకు చెల్లిస్తున్నది. బోనస్‌కు సంబంధించిన నిధులను సివిల్‌సైప్లె శాఖ నుంచి చెల్లించాల్సి ఉన్నది. ఇందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదలపై ఎలాంటి హామీ లభించలేదని తెలిసింది. శాఖ నుంచి ఫైల్ ప్రభుత్వానికి చేరినప్పటికీ, దీనిపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో బోనస్ విడుదలపై సివిల్ సైప్లె శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. సర్కార్ నుంచి నిధులు వస్తేగానీ తామేం చేయలేమని చెప్తున్నారు. ఇదిలా ఉంటే మద్దతు ధర నిధులు కూడా పూర్తిగా విడుదల కావడంలేదు. రైతులకు 73 లక్షల టన్నులకుగాను సుమారు రూ.17,500 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.14వేల కోట్లు చెల్లించినట్టు తెలిసింది. అంటే ఇంకా రూ.3,500 కోట్లు బకాయి ఉండటం గమనార్హం.
మరో సీజన్ బోనస్‌కు ఎగనామమేనా?
సన్న ధాన్యానికి ఒక సీజన్లో బోనస్ ఇస్తే, మరో సీజన్లో ఎగవేయడం కాంగ్రెస్ సర్కార్‌కు అలవాటుగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత యాసంగి బోనస్‌ను ప్రభుత్వం ఎగవేసింది. గత యాసంగిలో 4 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకుగాను రైతులకు బోనస్ కింద రూ.1,159.64 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు గత యాసంగి బోనస్ నిధులను రైతులకు ఇవ్వలేదు. దీంతో ఈ యాసంగిలోనూ తమకు రావాల్సిన బోనస్ డబ్బులను సర్కార్ ఎగవేస్తుందేమోనన్న ఆందోళన రైతులను వెంటాడుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

