హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థులకు గుర్తింపు లభించడంలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు, ఇందుకు కృషి చేసిన అధ్యాపకులను గౌరవించుకోవడం కనీస బాధ్యత అని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని డిమాండ్ చేశారు.