 
                                                            యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాని(Lakshmi Narasimha Swamy)కి భక్తుల(Devotees) రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు.
దీంతో స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2గంటలు, ప్రత్యేక దర్శనానికి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండక్రింద విష్ణుపుష్కరణి,కారు పార్కింగ్,బస్ స్టాండ్ లో భక్తుల సందడి నెలకొంది.
 
                            