యాదగిరిగుట్ట, మార్చి 4: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అలంకార సేవోత్సవంలో భాగంగా మంగళవారం నృసింహ స్వామి ఉదయం వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి హంసవాహనంలో ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగారు.
తూర్పు మాఢవీధుల్లో ప్రత్యేక వేంచేపు మండపంలో స్వామివారిని ఆస్థానం చేసి ప్రధానార్చకులు వటపత్రశాయి విశిష్టతను భక్తులకు వినిపించారు. ఆలయ అనువంశికధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కర్రావు, డీఈవో దోర్బల భాస్కర్శర్మ, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు పాల్గొన్నారు.