యాదగిరిగుట్ట,యాదాద్రి : యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని శ్రీలక్ష్మి నారసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం ఆలయానికి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల తాకిడికి అనుగుణంగా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.51,62,780 ఆదాయం (Income) వచ్చిందని వెల్లడించారు.
ప్రధాన బుకింగ్(Main booking) ద్వారా రూ. 7,62,800, కైంకర్యములు ద్వారా రూ. 4,200, సుప్రభాతం(Suprabatam) ద్వారాద్వారా రూ. 9,500,పుష్కరిణీ ద్వారా రూ.1600,వ్రతాల ద్వారా రూ. 2,46,400 ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ప్రచార శాఖ ద్వారా రూ. 16,400, వీఐపీ దర్శనం ద్వారా రూ. 4,50,000,యాదరుషి నిలయం ద్వారా రూ. 1,15,168,ప్రసాదవిక్రయం ద్వారా రూ. 18,79,630 ఆదాయం వచ్చిందన్నారు.
పాతగుట్ట ద్వారా రూ.69,900, కళ్యాణ కట్ట ద్వారా రూ. 1,15,000,శాశ్వత పూజలు ద్వారా రూ. 5,000,వాహన పూజల ద్వారా రూ. 27,700,కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 6,50,000 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,72,716,శివాలయం ద్వారా రూ. 13,300,అన్నదానం ద్వారా రూ.71,511,బ్రేక్ దర్శనం(Break darsan) ద్వారా రూ. 5,03,400,క్లాక్ రూమ్ మొబైల్స్ ద్వారా రూ.33,475, మొక్కు వస్త్రాల ద్వారా రూ.15,080 ఆలయానికి వచ్చిందన్నారు.