యాదగిరి గుట్ట, యాదాద్రి : యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి ఆదాయం(Income) పెరుగుతుంది. మంగళవారం ఒక్కరోజే ఆలయానికి రూ. 26,86,327 వచ్చిందని ఆలయ అధికారులు( Temple Officers) వెల్లడించారు.
ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,85,742 , కైంకర్యముల ద్వారా రూ. 2,001 , సుప్రభాతం ద్వారా రూ. 6,900 , బ్రేక్ దర్శనం ద్వారా రూ. 1,62,300, వ్రతాల ద్వారా రూ. 1,43,200, వాహన పూజల ద్వారా రూ. 11,000 ఆదాయం సమకూరిందని తెలిపారు. వీఐపీ (VIP) దర్శనం ద్వారా రూ. 1,05,000, ప్రచారశాఖ ద్వారా రూ. 18,750, పాతగుట్ట ద్వారా రూ. 34,870 , కొండపైకి వాహన ప్రవేశం(Vehicle Entrys) ద్వారా రూ. 3,50,000, యాదఋషి నిలయం ద్వారా రూ. 84,446, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,29,148 ఆదాయం వచ్చిందన్నారు.
శివాలయం ద్వారా రూ. 8,200, పుష్కరిణీ ద్వారా రూ. 1050, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 10,62,300, శాశ్వత పూజల ద్వారా రూ. 25,000, కళ్యాణ కట్ట ద్వారా రూ. 83,500 , అన్నదానం(Annadanam) ద్వారా రూ. 12,565, లిజెస్ లీగల్ ద్వారా రూ. 56,355, ఇతరముల ద్వారా రూ. 4000 ఆదాయం స్వామివారికి వచ్చిందని పేర్కొన్నారు.