యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకాలతో స్వామి వారి నిత్యారాధనలు ప్రారంభించారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. హోమం జరిపారు.
ప్రతీరోజు నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణతంతును వీక్షించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.