Wanindu Hasaranga : స్వదేశంలో జరగుతున్న ప్రపంచకప్‌లో ఆతిథ్య శ్రీలంక మరో షాక్. తొలి విజయంతో జోరుమీదున్న ఆ జట్టు వనిందు హసరంగ (Wanindu Hasaranga) సేవల్ని కోల్పోనుంది. గాయం కారణంగా ఈ సీనియర్ ఆల్‌రౌండర్ మెగా టోర్నీ నుంచి వైదొలగడమే అందుకు కారణం. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై మూడు వికెట్లతో మెరిసిన హసరంగ అనూహ్యంగా గాయంతో ఇబ్బంది పడ్డాడు. వైద్య పరీక్షల అనంతరం అతడికి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో.. ఈ మ్యాచ్ విన్నర్ అందుబాటులో ఉండడు.
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఏ జట్టైనా తమ ప్రధాన అస్త్రాలను నమ్ముకుంటుంది. కానీ, శ్రీలంకకు మాత్రం ఈసారి ఆ అవకాశం కోల్పోయింది. ఇప్పటికే పేసర్ ఇషాన్ మలింగ (Eshan Malinga) గాయంతో దూరమవ్వగా.. ఇప్పుడు ఆల్‌రౌండర్ హసరంగ సైతం వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించాడు. ఇటీవల కాలంలో గాయాలతో సతమతమవుతూ జట్టుకు దూరమైన వనిందు హసరంగ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఎడమ కాలి కండరాల నొప్పితో ఇబ్బందిపడ్డాడు.
JUST IN: Wanindu Hasaranga has been ruled out of the #T20WorldCup after an MRI scan on Tuesday revealed a serious tear in his left hamstring
He will likely be replaced in Sri Lanka’s squad by fellow legspin-bowling allrounder Dushan Hemantha pic.twitter.com/u9lELt336R
— ESPNcricinfo (@ESPNcricinfo) February 10, 2026
ఫిజియో వచ్చి పరీక్షించాక ఓవర్ పూర్తి చేసిన అతడు.. వికెట్ తీసి డగౌట్‌కు వెళ్లాడు. కాసేపటికి తిరిగొచ్చిన హసరంగ మరో వికెట్ తీసి లంక విజయంలో కీలకమయ్యాడు. కానీ, మ్యాచ్ అనంతరం ఎంఆర్ఐ స్కానింగ్‌లో అతడికి ఎడమ కాలి కండరంలో చీలక వచ్చినట్టు గుర్తించారు. దాంతో.. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలా ఈ స్టార్ ఆల్‌రౌండర్ మెగా టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. అతడి స్థానంలో దుషాన్ హేమంత (Dushan Hemantha) స్క్వాడ్‌లోకి రానున్నాడు.
పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక అదిరే బోణీ కొట్టింది. తొలి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై కుశాల్ పెరీరా(56 నాటౌట్ ), కమిందు మెండిస్(44) మెరుపులతో భారీ స్కోర్ చేసిన లంక.. ప్రత్యర్థిని 143కే ఆలౌట్ చేసింది. హ్యారీ టెక్టర్(40) పోరాడినా.. సమచరుల నుంచి మద్దతు కరువైంది. హసరంగ(3-25), థీక్షణ(3-23), పతిరణ(3-25)లు మూడేసి వికెట్లతో చెలరేగగా లంక 20 పరగుల తేడాతో గెలిచి రెండు పాయింట్లు సొంతం చేసుకుంది.