Assam voter list | అసోంలో 2.4 లక్షల ఓట్లు తొలగింపు.. ఎస్ఆర్ అనంతరం కొత్త ఓటర్ల జాబితా విడుదల
Assam voter list : అసోంలో 2.4 లక్షల ఓట్లను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసోంలో ఎన్నికల సంఘం స్పెషల్ రివిజన్ (ఎస్ఆర్) నిర్వహించిన సంగతి తెలిసిందే.
Assam voter list : అసోంలో 2.4 లక్షల ఓట్లను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసోంలో ఎన్నికల సంఘం స్పెషల్ రివిజన్ (ఎస్ఆర్) నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఆర్ నిర్వహించి తాజా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,49,58,139 మంది ఓటర్లున్నారు.
ఇంతకుముందు ఉన్న 2,52,01,624 మంది ఓటర్లలోంచి 2,43,485 మందిని తొలగించింది. తాజా జాబితా ప్రకారం అసోంలో 1,24,82,213 మంది పురుష ఓటర్లు, 1,24,75,583 స్త్రీ ఓటర్లు, 343 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొదట ఇంటిగ్రేటెడ్ ఓటర్ల జాబితాను గత ఏడాది డిసెంబర్ 27న ప్రకటించారు. అంతకుముందు నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు ఇంటింటికీ తిరిగి ఓటర్ జాబితా సర్వే నిర్వహించారు. ఇందులో సరైన ధృవపత్రాలు లేని వారు, మరణించిన వారు, అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నవారి పేర్లను జాబితా నుంచి తొలగించారు.
డిసెంబర్ 27న డ్రాఫ్ట్ ప్రకటించిన తర్వాత మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు ఓటర్లకు జనవరి 22 వరకు సమయమిచ్చారు. ఈ లోపు వచ్చిన ఫిర్యాదులు అన్నీ పరిష్కరించి తాజాగా తుది జాబితా విడుదల చేశారు. వచ్చే మార్చి-ఏప్రిల్‌లో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓట్ల విషయంలో ఈసీ కీలకంగా వ్యవహరిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- ceo
- EC
- Election commission
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

